AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: షోయబ్‌తో విడాకుల తర్వాత సానియా మీర్జా మరో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్.. అలా అనేసిందేంటి?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తోంది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోవడం, ఆ వెంటనే పాక్ నటి సనా జావేద్ తో షోయబ్ పెళ్లిపీటలెక్కడం సానియాను బాగా కుంగదీశాయని చెప్పుకోవచ్చు. అందుకే తనకు తాను ధైర్యం చెప్పుకుంటోందీ టెన్నిస్ క్వీన్

Sania Mirza: షోయబ్‌తో విడాకుల తర్వాత సానియా మీర్జా మరో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్.. అలా అనేసిందేంటి?
Sania Mirza
Basha Shek
|

Updated on: Mar 06, 2024 | 12:51 PM

Share

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తోంది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోవడం, ఆ వెంటనే పాక్ నటి సనా జావేద్ తో షోయబ్ పెళ్లిపీటలెక్కడం సానియాను బాగా కుంగదీశాయని చెప్పుకోవచ్చు. అందుకే తనకు తాను ధైర్యం చెప్పుకుంటోందీ టెన్నిస్ క్వీన్. భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి తన కుమారుడితో కలిసి దుబాయ్‏లోనే ఉంటోంది సానియా. షోయబ్ తో విడాకుల గురించి ఏనాడూ డైరెక్టుగా ప్రస్తావించని సానియా నెట్టింట మాత్రం కొన్ని ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తోంది. ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలా తాజాగా ఇన్ స్టాలో మరొక పోస్ట్ పెట్టింది సానియా. ‘మృదువుగానే ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు మిమ్మల్ని మీరు కాని వ్యక్తిగా మార్చే అవకాశం ఇవ్వొద్దు’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టిందీ టెన్నిస్ క్వీన్. అయితే దేనిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో క్లియర్ గా తెలియదు కానీ విడాకుల అనంతరం తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకే ఇలా పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు జన్మించాడు. భారత క్రీడా చరిత్రలో సానియా మీర్జాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. టెన్నిస్ లో ఆమె ప్రయాణం, విజయాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా బిడ్డను కన్న తర్వాత కూడా అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా రాణించిన తీరు అమోఘం. ఇవి ఆమె పట్టుదల, మనో నిబ్బరానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టెన్నిస్ సంగతి పక్కన పెడితే.. సానియా వ్యక్తిగత జీవితం ఒడిదొడుకుల మయం. అప్పట్లో షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో చాలామంది ఆమెను దూషించారు. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో మళ్లీ ఆమె పర్సనల్ లైఫ్ వార్తల్లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌