సానియా మీర్జా
సానియా మీర్జా భారత మాజీ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. డబుల్స్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. మార్టినా హింగిస్‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌లను గెలుచుకున్నారు. ఈ జోడీ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జోడీ మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. ఇది కాకుండా సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది.
డబుల్స్‌లో తనదైన ముద్ర వేయడానికి ముందు, సానియా సింగిల్స్‌లో మంచిపేరు సంపాదించింది. ఆమె WTA ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరుకుంది. భారతదేశం నుంచి ఈ స్థానానికి చేరుకున్న మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, మణికట్టు గాయం కారణంగా, ఆమె తన దృష్టిని డబుల్స్‌పైనే కేంద్రీకరించింది.
సానియా ఎప్పుడూ తన క్రీడల కారణంగా హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. అయితే, ఇది కాకుండా ఆమె తన గ్లామరస్ స్టైల్ కారణంగా కూడా వార్తల్లో నిలిచింది. 2010లో, ఆమె పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఈ కారణంగా ఆమె చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు ఇజాన్.
2023లో, ఇద్దరి మధ్య అంతా బాగాలేదని వార్తలు వినిపించాయి. ఆపై జనవరి 2024లో షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. దీంతో వీరి సంబంధం తెగిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకున్నారని స్పష్టమైంది. సానియా 2023లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది.
Sania Mirza: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన సానియా మీర్జా .. ఆ ఫొటోలు షేర్ చేస్తూ సంచలన పోస్ట్
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. అలాగే 100 మంది ఉగ్రవాదలు కూడా హతమయ్యారు. దీనిపై సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆపరేషన్ సిందూర్ పై స్పందించింది.
- Basha Shek
- Updated on: May 8, 2025
- 6:39 pm
Sania Mirza: సానియాకు ధైర్యమెక్కువే.. చెవులు ఎలా కుట్టించుకుందో మీరే చూడండి.. వీడియో
టీమిండియా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె, సానియా, అలాగే రాబిన్ ఉతప్ప భార్య శీతల్ జంటగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
- Basha Shek
- Updated on: Nov 18, 2024
- 9:53 pm
Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్
హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా పేరు ఈ మధ్యన బాగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని, రాజకీయాల్లోకి వస్తుందని.. ఇలా తరచూ ఏదో ఒక రూమర్లు సానియాపైనే వస్తున్నాయి. అయితే ఈ టెన్నిస్ బ్యూటీ మాత్రం వీటిని అసలు లెక్క చేయడం లేదు.
- Basha Shek
- Updated on: Oct 31, 2024
- 10:53 pm
Sania Mirza-Mohammed Shami: సానియా మీర్జాతో రెండో పెళ్లి.. తొలిసారిగా స్పందించిన టీమిండియా క్రికెటర్ షమీ
షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది జహీన్. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడీ టీమిండియా స్టార్ పేసర్. అయితే గత కొన్ని నెలలుగా మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకోనున్నాడంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో షమీ నిఖా చేసుకోనున్నాడంటూ రూమర్లు సృష్టించారు నెటిజన్లు.
- Basha Shek
- Updated on: Jul 20, 2024
- 11:21 am
Sania Mirza: టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నయా పోస్ట్.. కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ప్రస్తుతం సానియా తన జీవితంలో చాలా కష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు ఎంతో ట్రై చేస్తోందీ టెన్నిస్ స్టార్. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతోంది
- Basha Shek
- Updated on: Jun 29, 2024
- 5:44 pm
Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీతో సానియా రెండో పెళ్లి.. తండ్రి ఇమ్రాన్ మీర్జా ఏమన్నారంటే?
టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొన్ని నెలల క్రితం తన భర్త షోయబ్ మాలిక్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్కడ బయటా కనిపించలేదామె. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా మారిపోయింది. అలాగనీ షోయబ్ మూడో పెళ్లి ముచ్చట గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. తన కుమారుడి ఆలనా పాలనతో బిజీగా ఉంటూనే
- Basha Shek
- Updated on: Jun 21, 2024
- 11:06 am
Sania Mirza: మక్కాలో సానియా మీర్జాను కలిసిన టాలీవుడ్ హీరోయిన్.. చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
ఇందులో సానియా, ఆనమ్ మీర్జాల మధ్యలో చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్. నాగార్జున, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ తదితర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది.
- Basha Shek
- Updated on: Jun 17, 2024
- 12:00 am
Sania Mirza: ‘షోయబ్ లాగే సానియా కూడా మళ్లీ పెళ్లీ చేసుకోవాలి’.. పాక్ నటుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఫైర్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా మాలిక్ ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో వీరి వివాహం జరగ్గా, ఇప్పుడు అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ కపుల్. మరోవైపు షోయబ్ మాలిక్ తో విడాకుల అనంతరం సానియా మీర్జా దుబాయ్ కి షిఫ్ట్ అయింది
- Basha Shek
- Updated on: May 18, 2024
- 5:10 pm
Sania Mirza: షోయబ్‌తో విడాకుల తర్వాత సానియా మీర్జా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అలా అనేసిందేంటి?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తోంది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోవడం, ఆ వెంటనే పాక్ నటి సనా జావేద్ తో షోయబ్ పెళ్లిపీటలెక్కడం సానియాను బాగా కుంగదీశాయని చెప్పుకోవచ్చు. అందుకే తనకు తాను ధైర్యం చెప్పుకుంటోందీ టెన్నిస్ క్వీన్
- Basha Shek
- Updated on: Mar 6, 2024
- 12:51 pm
Video: షోయబ్ మాలిక్ మూడో భార్యకు సానియా మీర్జా ఎఫెక్ట్.. లైవ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Shoaib Malik Wife Sana Javed: షోయబ్ మాలిక్, సనా జావేద్ ఇటీవల వార్తల్లో నిలిచారు. సానియా మీర్జా నుంచి విడాకుల వార్తల మధ్య, మాలిక్ పాకిస్తాన్ స్టార్ సనా జావేద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. అతను తన వివాహ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నప్పుడు, ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఈ సమయంలో, షోయబ్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు. ఈ క్రమంలో అభిమానులు సానియా మీర్జా పట్ల చాలా సానుభూతిని వ్యక్తం చేశారు.
- Venkata Chari
- Updated on: Feb 22, 2024
- 6:13 pm
Mohammed Shami – Sania Mirza: సానియా మీర్జాతో షమీ నిశ్చితార్థం.. అసలు విషయం ఏంటంటే?
Mohammed Shami - Sania Mirza: తాజాగా సానియా మీర్జా వ్యక్తిగత జీవింతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్‌తో తన మూడో పెళ్లిని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మీడియా దృష్టిలో పడింది. షోయబ్ మాలిక్ తన మూడవ వివాహం గురించి ప్రకటించిన తరువాత, భారత టెన్నిస్ స్టార్‌కి అభిమానులు సంఘీభావం తెలిపారు. దీంతో సానియా మీర్జా పట్ల సానుభూతి వెల్లువెత్తింది.
- Venkata Chari
- Updated on: Jun 10, 2024
- 12:32 pm