Video: షోయబ్ మాలిక్‌ మూడో భార్యకు సానియా మీర్జా ఎఫెక్ట్.. లైవ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

Shoaib Malik Wife Sana Javed: షోయబ్ మాలిక్, సనా జావేద్ ఇటీవల వార్తల్లో నిలిచారు. సానియా మీర్జా నుంచి విడాకుల వార్తల మధ్య, మాలిక్ పాకిస్తాన్ స్టార్ సనా జావేద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. అతను తన వివాహ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నప్పుడు, ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఈ సమయంలో, షోయబ్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు. ఈ క్రమంలో అభిమానులు సానియా మీర్జా పట్ల చాలా సానుభూతిని వ్యక్తం చేశారు.

Video: షోయబ్ మాలిక్‌ మూడో భార్యకు సానియా మీర్జా ఎఫెక్ట్.. లైవ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Fans Chant Sania Mirza Name
Follow us
Venkata Chari

| Edited By: TV9 Telugu

Updated on: Feb 22, 2024 | 6:13 PM

Shoaib Malik Wife Sana Javed Video: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 మూడో మ్యాచ్‌లో, ముల్తాన్ సుల్తాన్స్ కరాచీ కింగ్స్‌ను 55 పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్‌లో విజయాన్ని ప్రారంభించింది. షోయబ్ మాలిక్ ఈ మ్యాచ్‌లో కరాచీ తరపున ఆడుతున్నాడు. అతను తన జట్టు కోసం 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అయితే, అతని ఇన్నింగ్స్ జట్టుకు ఏమాత్రం సరిపోదని నిరూపితమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో, షోయబ్ మాలిక్ మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఆ కారణం అతని భార్య సనా జావేద్ కావడం గమనార్హం.

షోయబ్ మాలిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కెమెరామెన్ స్టాండ్‌లో కూర్చున్న అతని భార్యపై దృష్టి పెట్టాడు. ఆపై సనా నవ్వుతూ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇదే సమయంలో స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు సనాను చూసి ఆటపట్టించడం కనిపించింది. ప్రస్తుతం, ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో పాకిస్థాన్ అభిమానులు సానియా మీర్జా పేరును పిలుస్తూ.. సనా జావేద్‌ను ఆటపట్టిస్తున్నట్లు చూడొచ్చు. సనా కూడా అభిమానుల గొంతు విని వారి వైపు చూసి రియాక్ట్ అయింది.

ఈ వైరల్ వీడియోను ఇక్కడ చూడొచ్చు..

View this post on Instagram

A post shared by akhan ayat (@akhan_ayat)

షోయబ్ మాలిక్, సనా జావేద్ ఇటీవల వార్తల్లో నిలిచారు. సానియా మీర్జా నుంచి విడాకుల వార్తల మధ్య, మాలిక్ పాకిస్తాన్ స్టార్ సనా జావేద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. అతను తన వివాహ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నప్పుడు, ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఈ సమయంలో, షోయబ్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు. ఈ క్రమంలో అభిమానులు సానియా మీర్జా పట్ల చాలా సానుభూతిని వ్యక్తం చేశారు.

కాగా, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అయితే జవాబిచ్చిన కరాచీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌లో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే