AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: సానియాకు ధైర్యమెక్కువే.. చెవులు ఎలా కుట్టించుకుందో మీరే చూడండి.. వీడియో

టీమిండియా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె, సానియా, అలాగే రాబిన్ ఉతప్ప భార్య శీతల్ జంటగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Sania Mirza: సానియాకు ధైర్యమెక్కువే.. చెవులు ఎలా కుట్టించుకుందో మీరే చూడండి.. వీడియో
Sania Mirza
Basha Shek
|

Updated on: Nov 18, 2024 | 9:53 PM

Share

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటోంది. తన కుమారుడు ఇజాన్ మీర్జాతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలనలోనే ఎక్కువగా సమయం గడిపేస్తోంది టెన్నిస్ క్వీన్. ఇక అప్పుడప్పుడు సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా కూడా వారితో సరదాగా గడుపుతుంటుంది. అలా తాజాగా అనమ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. అందులో ఆమె నొప్పితో విలవిల్లాడుతూ కనిపించింది. ఇది గమనించిన సానియా వెంటనే తన సోదరి చేయి పట్టుకుని నొప్పిని తగ్గించడానికి ప్రయత్నించింది. వీరిద్దరితో పాటు ఓ భారత క్రికెటర్ భార్య కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అవును ఆనం షేర్ చేసిన వీడియోలో భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప భార్య శీతల్ కూడా ఉంది. ఆమె కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంటోంది. తాజాగా వీరు ముగ్గురు చెవులు కుట్టించుకున్నారు. శీతల్, సానియా ఎలాగో నొప్పి భరించారు కానీ అనమ్ మాత్రం చాలా గట్టిగా అరిచేసింది. దీంతో వెనకాల నిలబడిన సానియా వేగంగా ముందుకు వచ్చి ఆనం చేతిని గట్టిగా పట్టుకుని నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా దుబాయ్ లోని ఓ ప్రముఖ ఇయర్ పియర్సింగ్ సంస్థ ప్రమోషన్ కోసం సానియా, ఆనం, శీతల్ చెవులు కుట్టించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే రాబిన్ ఉతప్ప భార్య శీతల్ సానియా ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ చాలా సార్లు కనిపించారు. సానియా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి, పార్టీలకు శీతల్ హాజరవుతుంటుంది. ఇది మాత్రమే కాదు, రాబిన్ ఉతప్ప కుమారుడు, సానియా మీర్జా కుమారుడు కూడా స్నేహితులుగా మారిపోయారు.

వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Anam Mirza (@anammirzaaa)

కాగా సానియాతో విడాకుల తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక సానియా మీర్జా మాత్రం తన కుమారుడితోనే జీవితం గడుపుతోంది.

దుబాయ్ లో సోదరి ఆనమ్ మీర్జాతో సానియా మీర్జా..

View this post on Instagram

A post shared by Anam Mirza (@anammirzaaa)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..