AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసినోడు.. చివరికి.!

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంగురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిరంజీవితో చేసిన తొలి చిత్రం, చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు లాంటి విజయవంతమైన సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Tollywood: దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసినోడు.. చివరికి.!
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Feb 27, 2026 | 9:53 PM

Share

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు తమ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిరంజీవితో నారాయణరావు నటించిన తొలి చిత్రం కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను పూర్ణచంద్రరావు నిర్మించగా, హిందీలో అంధా కానూన్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో నారాయణరావు పోషించిన క్యారెక్టర్‌ను అమితాబ్ బచ్చన్ చేయగా, చిరంజీవి క్యారెక్టర్‌ను రజనీకాంత్ పోషించారు. తన పాత్ర నచ్చడంతోనే అమితాబ్ హీరో పాత్రను కాదని, తన క్యారెక్టర్‌ను ఎంచుకున్నారని నారాయణరావు గుర్తు చేసుకున్నారు.

నారాయణరావు తన తల్లి పేరున దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి దేవాంతకుడు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారానే చిరంజీవి, విజయశాంతి తొలిసారిగా జంటగా నటించారు. ఇందులో నారాయణరావుదే లీడ్ క్యారెక్టర్‌ అని తెలిపారు. దేవాంతకుడు విజయవంతమయ్యాక, చిరంజీవి తన సినిమాలకు సబ్జెక్టులు చూసే బాధ్యతను నారాయణరావుకు అప్పగించారట. అనంతరం, యముడికి మొగుడు చిత్రాన్ని సుధాకర్, హరిప్రసాద్‌లతో కలిసి ముగ్గురు భాగస్వాములుగా నిర్మించారు. సుధాకర్, హరిప్రసాద్‌లకు నిర్మాణ అనుభవం లేకపోవడంతో, చిరంజీవే స్వయంగా నారాయణరావును ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కావాలని కోరారు.

నారాయణరావు కుటుంబానికి మొదటి నుంచీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాదరావు, జె.డి. ప్రసాదరావుగా ప్రసిద్ధి చెందారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్. నవయుగ ఫిల్మ్స్, నవయుగ విడుదల వంటి సంస్థలు వారివే. అంతేకాకుండా, ఆయన తండ్రి సారథి స్టూడియోస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నారాయణరావు బావ గారపాటి సాంబశివరావు, త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణతో కలిసి 13 సినిమాలు నిర్మించారు. ఆయన తండ్రి అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే వంటి చిత్రాలను నిర్మించారు, ఇందులో కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర