Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీతో సానియా రెండో పెళ్లి.. తండ్రి ఇమ్రాన్ మీర్జా ఏమన్నారంటే?
టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొన్ని నెలల క్రితం తన భర్త షోయబ్ మాలిక్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్కడ బయటా కనిపించలేదామె. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా మారిపోయింది. అలాగనీ షోయబ్ మూడో పెళ్లి ముచ్చట గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. తన కుమారుడి ఆలనా పాలనతో బిజీగా ఉంటూనే
టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొన్ని నెలల క్రితం తన భర్త షోయబ్ మాలిక్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్కడ బయటా కనిపించలేదామె. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా మారిపోయింది. అలాగనీ షోయబ్ మూడో పెళ్లి ముచ్చట గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. తన కుమారుడి ఆలనా పాలనతో బిజీగా ఉంటూనే నెట్టింట స్ఫూర్తిదాయకమైన సందేశాలను షేర్ చేసింది. తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అయితే షోయబ్ తో విడాకుల తర్వాత సానియా కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీతో సానియా రెండో వివాహం జరగనుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సానియా కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు. మహమ్మద్ షమీని సానియా వివాహం చేసుకోనుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరగుతోంద. తాజాగా ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహ్మద్ షమీతో సానియా పెళ్లి అంటూ వస్తోన్న వార్తలు నమ్మవద్దని, అవన్నీ చెత్త వార్తలన్నారు. ఇప్పటి వరకు మహ్మద్ షమీని సానియా కలవలేదని ఇమ్రాన్ మీర్జా కుండబద్దలు కొట్టారు. మరి ఇప్పుడైనా సానియా రెండో పెళ్లి వార్తలపై రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం హజ్ యాత్రలో బిజిబిజీగా ఉంటోంది సానియా మీర్జా. ఆమె వెంట సోదరి ఆనమ్ మీర్జా కూడా ఉంది. హజ్ యాత్రకు చెందిన ఫొటోలు, వీడియోలన్నింటినీ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తోంది సానియా. ఇక మక్కా యాత్రకు వెళ్లే ముందు సానియా ఒక సుదీర్ఘమైన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ నేను పూర్తిగా మారిపోతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నా ప్రార్థనలను అల్లా ఆలకిస్తున్నాడనుకుంటున్నాను. నేను ఎంతో అదృష్టవంతురాలినని, పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా నన్ను గుర్తుంచుకోవాలని, ఒక మంచి మనిషిలా నేను తిరిగి వస్తానని ఆశిస్తున్నాను’ అని తన పోస్టులో చెప్పుకొచ్చింది సానియా మీర్జా.
మక్కా యాత్రలో సానియా సోదరీ మణులతో నటి సనాఖాన్..
View this post on Instagram
సానియా ట్వీట్ ఇదిగో…
🤲🏽❤️🕋 pic.twitter.com/oKOnQ0FInU
— Sania Mirza (@MirzaSania) June 9, 2024
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.