OTT Movies: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఓటీటీలో సందడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇక శుక్రవారం (జూన్ 21) ఈ ఎంటర్ టైన్మెంట్ మరింత రెట్టింపు కానుంది. ఒక్క శుక్రవారమే ఏకంగా 11 సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో సుమారు 20 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

OTT Movies: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Friday OTT Movies
Follow us

|

Updated on: Jun 20, 2024 | 11:47 AM

మరో వీకెండ్ వచ్చేసింది. అయితే వచ్చే వారం ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వారం కూడా చిన్న సినిమాలే థియేటర్లలోకి రానున్నాయి. హనీమూన్ ఎక్స్‌ప్రెస్, నింద, ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంతిమ తీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే, మరణం సై అంటే సై సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. వీటితోపాటు ఉపేంద్ర ఏ, ప్రేమ కథా చిత్రమ్, కేజీఎఫ్ 1 చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీలో సందడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇక శుక్రవారం (జూన్ 21) ఈ ఎంటర్ టైన్మెంట్ మరింత రెట్టింపు కానుంది. ఒక్క శుక్రవారమే ఏకంగా 11 సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో సుమారు 20 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటిలో రాశీఖన్నా, తమన్నాల అరణ్మనై 4 (తెలుగులో బాకు), నడిగర్ తిలగం, రసవతి సినిమాలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ లో వివిధ ఓటీటల్లో వచ్చే సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ను చూసేద్దాం రండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • బాక్ ( అరణ్మనై 4) – తెలుగు డబ్బింగ్ మూవీ
  • మై నేమ్ ఈజ్ గాబ్రియోల్ – కొరియన్ వెబ్ సిరీస్
  • బ్యాడ్ కాప్ – హిందీ వెబ్ సిరీస్
  • ద బేర్ సీజన్ 3 – ఇంగ్లిష్ వెబో సిరీస్

నెట్‍‌ఫ్లిక్స్

  • నడికర్ తిలగం – తెలుగు డబ్బింగ్ సినిమా
  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 – మాండరిన్ వెబ్ సిరీస్
  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా – స్పానిష్ వెబ్ సిరీస్
  • ట్రిగ్గర్ వార్నింగ్ – ఇంగ్లిష్ మూవీ
  • కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 – హిందీ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
  • అమెరికన్ స్వీట్ హార్ట్స్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
  • ద యాక్సిడెంటల్ ట్విన్స్ – స్పానిష్ సినిమ (స్ట్రీమింగ్)
  • రైజింగ్ ఇంపాక్ట్ – జపనీస్ వెబ్ సిరీస్

ఆహా

ఇవి కూడా చదవండి
  • రసవతి – తమిళ సినిమా

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • గం గం గణేశా- తెలుగు సినిమా (ఆల్ రెడీ స్ట్రీమంగ్ అవుతోంది)
  • రాధామాధవం- తెలుగు సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
  • లెస్ ఇన్ఫైలబుల్స్ – ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఫెదరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ – ఇంగ్లిష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

బుక్ మై షో

లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ – ఇటాలియన్ మూవీ

ఇవి కాక  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.