Tollywood: ఈ సర్కిల్‌లోని కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ మాస్ హీరో.. డేరింగ్ అండ్ డ్యాషింగ్.. గుర్తు పట్టారా?
పై ఫొటోలో సర్కిల్‌లో ఉన్న కుర్రాడెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ కుర్రాడు పెరిగి పెద్దయ్యాడు. టాలీవుడ్ లో హీరో కూడా అయ్యాడు. అందరిలా కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను సృష్టించుకుంటున్నాడు. మాస్ సినిమాలు చేస్తూనే లవర్ బాయ్ పాత్రలు వేస్తున్నాడు. అవసరమైతే విలన్ వేషాలు కూడా వేస్తున్నాడు
పై ఫొటోలో సర్కిల్‌లో ఉన్న కుర్రాడెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ కుర్రాడు పెరిగి పెద్దయ్యాడు. టాలీవుడ్ లో హీరో కూడా అయ్యాడు. అందరిలా కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను సృష్టించుకుంటున్నాడు. మాస్ సినిమాలు చేస్తూనే లవర్ బాయ్ పాత్రలు వేస్తున్నాడు. అవసరమైతే విలన్ వేషాలు కూడా వేస్తున్నాడు. అయితే సినిమాలతో పాటు నిత్యం వివాదాల్లోనూ నిలవడం ఈ హీరో స్టైల్. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. నచ్చని విషయమైతే ముఖమ్మీదే చెబుతాడు. దీంతో కొన్ని సార్లు కాంట్రవర్సీ అయ్యాడీ హీరో. అయితే అదే ముక్కుసూటితత్వమే అతనికి ఎంతో మంది అభిమానులను తెచ్చి పెట్టింది. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకు ఒక క్లూ.. కొన్ని నెలల క్రితం అఘోరా పాత్రలో కనిపించిన ఈ హీరో ఇటీవలే గోదావరి కుర్రాడి పాత్రలో అదరగొట్టాడు. మరోసారి మాస్ హీరోగా అభిమాలను మెప్పించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ అతను మరెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ ఫొటో అతని స్కూల్ డేస్ నాటిది.
విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా డైరెక్షన్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ఇక ఇటీవల గామీ సినిమాలో అఘోరా పాత్రలో అదరగొట్టాడు విశ్వక్ సేన్. ఇందులో అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కొన్ని రోజలు కిందటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మన ముందుకు వచ్చాడు. గోదావరి నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. చైతన్య కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో లంకల రత్నాకర్ అలియాస్ టైగర్ రత్న పాత్రలో నటించాడు విశ్వక్ సేన్. ఇక తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా అప్ డేట్స్ రావాల్సి ఉంది.
People are not ready for this , you are not ready for this . Witness the intense action drama and it’s our #telugucinema . #GangsofGodavari out now . 🔥 saritralo migilipodhi anthe . #historic pic.twitter.com/vyqY3ATG3F
— VishwakSen (@VishwakSenActor) May 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.