AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? సపోర్టింగ్ రోల్స్ నుంచి స్టార్ హీరో దాకా.. యాక్టింగ్‌లో తోపు అంతే

ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ఒక హీరో చిన్నప్పటి ఫొటో ఇది. హీరో అనడం కంటే నటుడని చెప్పుకుంటేనే అతని ట్యాలెంటె్ కు నిజమైన గుర్తింపు ఇచ్చినట్లు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ అదే స్టార్ హీరోలకు పోటీగా మారిపోయాడీ యాక్టర్.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? సపోర్టింగ్ రోల్స్ నుంచి స్టార్ హీరో దాకా.. యాక్టింగ్‌లో తోపు అంతే
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 29, 2024 | 10:26 PM

Share

పై ఫొటోలో రాముడి మంచి బాలుడిలా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ఒక హీరో చిన్నప్పటి ఫొటో ఇది. హీరో అనడం కంటే నటుడని చెప్పుకుంటేనే అతని ట్యాలెంటె్ కు నిజమైన గుర్తింపు ఇచ్చినట్లు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ అదే స్టార్ హీరోలకు పోటీగా మారిపోయాడీ యాక్టర్. హీరోగా అభిమానులను అలరిస్తూనే విలన్ గానూ మెప్పిస్తున్నాడీ వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు అతని పేరు మరోసారి మార్మోగిపోతోంది. అతను నటించిన ఒక సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. కనివినీ ఎరుగుని కలెక్షన్లు రాబడుతోంది. యస్.. ఈ బుడ్డోడు ఎవరో కాదు మహారాజ మూవీ హరో విజయ్ సేతుపతి. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది నటుల్లో మక్కల్ సెల్వన్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ధనుష్, కార్తి వంటి స్టార్స్ సినిమాల్లో సైడ్ యాక్టర్ గా నటించిన ఆయన తన యాక్టింగ్ తో హీరోగా ఎదిగాడు.

ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఉప్పెన, విక్రమ్, జవాన్ వంటి సినిమాల్లో తనదైన విలనిజం పండించారు విజయ్ సేతుపతి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మక్కల్ సెల్వన్ కు భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతుంటుంది. అలాగే సైరా, ఉప్పెన వంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనూ నటించి ఇక్కడి ఆడియెన్స్ కు చేరువయ్యారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన నటించిన చిత్ర మహారాజా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. ఇక ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న RC 16 లోనూ విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరిస్తోన్న డైరెక్టర్ చిట్టి బాబు.. వీడియో

మహరాజా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్