IND vs SA: అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ఏకంగా 143 రన్స్ తేడాతో..

భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌తో‌ 1-0తో భారత జట్టు ఆధిక్యంలో ని లిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్మృతి మంధాన సెంచరీ సహాయంతో 265 పరుగులు చేసింది

IND vs SA: అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ఏకంగా 143 రన్స్ తేడాతో..
Indian Women's Team
Follow us
Basha Shek

|

Updated on: Jun 16, 2024 | 10:24 PM

భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌తో‌ 1-0తో భారత జట్టు ఆధిక్యంలో ని లిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్మృతి మంధాన సెంచరీ సహాయంతో 265 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడిన లెగ్ స్పిన్నర్ ఆశా శోభన అత్యధికంగా 4 వికెట్లు తీసి మెరిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఓపెనర్ షఫాలీ వర్మ (7 పరుగులు) వికెట్ కోల్పోయింది. అనంతరం దయాళన్ హేమలత కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 10 పరుగులకే ఔటయ్యింది. జెమీమా, రిచా ఘోష్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే స్మృతి మంధాన మాత్రం ఒంటరి పోరాటం చేసింది. సఫారీ బౌలర్లను చితక బాదుతూ సెంచరీ కొట్టింది. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది.

266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్ లోనే కెప్టెన్ లారా వోల్వార్డ్ ను రేణుక క్లీన్ బౌల్డ్ చేసింది. 33 పరుగులకు చేరుకునే సమయానికి జట్టు 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞురాలైన మరిజన్నే కప్ 24 పరుగులు చేయడం ద్వారా జట్టు ఇన్నింగ్స్‌కు కొంత బలం చేకూర్చింది. అయితే ఈ వికెట్ పతనం తర్వాత ఆఫ్రికా జట్టు కుప్పకూలింది. సినలోవా జఫ్తా 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు దక్షిణాఫ్రికా జట్టు:

లారా వోల్‌వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, సునే లూస్, మరిజాన్నె కెప్, అన్నేరీ డెర్క్‌సెన్, నందుమిసో షాంగసే, సినాలో జఫ్తా, మసాబటా క్లాస్ అయాబొంగా ఝాకా, నంకులులేకో మ్లాబా

టీమ్ ఇండియా:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, డి హేమలత, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఎస్. ఆశా, రేణుకా సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాస్టర్ మైండ్‏తో దెబ్బకొట్టిన గౌతమ్..
మాస్టర్ మైండ్‏తో దెబ్బకొట్టిన గౌతమ్..
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రమాదంలో టీమిండియా ఫ్యూచర్.. ఎందుకంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రమాదంలో టీమిండియా ఫ్యూచర్.. ఎందుకంటే?
30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది కాదు..! ఎందుకో తెలుసా..?
30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది కాదు..! ఎందుకో తెలుసా..?
మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ..
మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ..
కలకలం రేపుతోన్న జంట హత్యలు.. నరికి ఇంటి ముందు పడేసి..
కలకలం రేపుతోన్న జంట హత్యలు.. నరికి ఇంటి ముందు పడేసి..
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెయిర్‌డై అవసరం లేదు..ఈ మూడు చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెయిర్‌డై అవసరం లేదు..ఈ మూడు చాలు
హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైన హీరోయిన్..
భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైన హీరోయిన్..
ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని
ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.