AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: కార్తీక దీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. వీడియో షేర్ చేసిన ఉషా రాణి

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి 'మీరు నాలా మోసపోకండి' అని హెచ్చరించింది

Karthika Deepam: కార్తీక దీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. వీడియో షేర్ చేసిన ఉషా రాణి
Karthika Deepam Serial Artist
Basha Shek
|

Updated on: Jun 16, 2024 | 7:30 AM

Share

బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిందీ ధారావాహిక. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ‘మీరు నాలా మోసపోకండి’ అని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. కార్తీకదీపం 2లో కీలక పాత్రలో నటిస్తోంది నటి ఉషారాణి. దీపకు అత్త క్యారెక్టర్ చేస్తుందామె. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసిందామె. అందులో ఇలా చెప్పుకొచ్చింది.’ నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. దానిని నా కుమారుడు బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ కార్డులో మొత్తం రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది. అయితే మా అబ్బాయి తరచూ కార్డులను ప్యాంటు జేబులో పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశాను. పైగా ఆ కార్డు నాకు కావాల్సిన ఆన్ లైన్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్ కి లింక్ అయి ఉండటంతో పని అయితే జరుగుతోంది కదా అని లైట్ తీసుకున్నాను’

ఇవి కూడా చదవండి

‘కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను’ అని వీడియోలో చెప్పుకొచ్చింది ఉషారాణి. ఈ సందర్భంగా ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిమానులు, ఫ్యాన్స్ ను సూచించిందామె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నటి షేర్ చేసిన వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Usha Rani (@usharani_actor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు