Tollywood: ఈ చిన్నారి గోపికను గుర్తు పట్టారా? టాలీవుడ్ మాటల మరాఠీ.. మీరునుకునే ఆమె మాత్రం కాదు

పై ఫొటోలో చిన్నారి గోపికలా పోజులిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? చారడేసి కళ్లు, చేతిలో కుండ పెట్టుకుని ఎంతో అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో పాటు తన మాటల గారడితో కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిందామె. అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసి తన సత్తాను చాటుకుంది

Tollywood: ఈ చిన్నారి గోపికను గుర్తు పట్టారా? టాలీవుడ్ మాటల మరాఠీ.. మీరునుకునే ఆమె మాత్రం కాదు
Tollywood Star Anchor
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2024 | 9:05 AM

పై ఫొటోలో చిన్నారి గోపికలా పోజులిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? చారడేసి కళ్లు, చేతిలో కుండ పెట్టుకుని ఎంతో అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో పాటు తన మాటల గారడితో కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిందామె. అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసి తన సత్తాను చాటుకుంది. అయితే ఉన్నట్లుండి ఈ అందాల యాంకరమ్మ సడెన్ గా మాయమైపోయింది. కొన్నేళ్ల పాటు అటు బుల్లితెరపై కానీ, ఇటు వెండితెరపై కానీ దర్శనమివ్వలేదు. పెళ్లై, పిల్లలున్న ఈ బ్యూటీ క్వీన్ ఈ మధ్యన మళ్లీ బిజీ అవుతోంది. టీవీ షోల్లో సందడి చేస్తోంది. మరి క్యూట్ బేబి ఎవరో గుర్తు పట్టారా? ఆ చిన్నారి మరెవరో కాదు ఒకప్పుడు యాంకర్ గా తెలుగు బుల్లితెరను ఏలిన ఉదయ భాను. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ఇక ఉదయ భాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ స్టార్ యాంకర్ గా టాలీవుడ్ బుల్లితెరపై చెరగని ముద్రను వేసుకుందామె. ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జానవులే నెర జానవులే’, ‘హృదయాంజలి’, ‘లక్స్ డ్రీమ్‌ గర్ల్‌, ‘ఛాంగురే బంగారు లేడి’, ‘డ్యాన్సింగ్ స్టార్’, ‘తీన్ మార్’ , ‘రేలా రే రేలా’, ‘రంగం’, ఢీ.. ఇలా ఏ ఛానెల్ చూసినా ఉదయభానే కనిపించేది.

ఇవి కూడా చదవండి

ఒకానొక సమయంలో స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఉదయభాను గట్టి పోటీ ఇస్తుందనుకుంది. అయితే పెళ్లి, పిల్లల కారణంగా సడెన్ గా కెమెరాకు దూరమైందీ అందాల యాంకరమ్మ. కొన్ని నెలల క్రితం ఓ టీవీ షోకు వచ్చిన ఉదయభాను బుల్లితెరకు తాను ఎందుకు దూరం కావల్సిందో చెబుతూ ఎమోషనలైంది. తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగానే యాంకరింగ్ కు దూరమైనట్లు ఉదయభాను చెప్పుకొచ్చింది. కాగా కొన్ని తెలుగు సినిమాల్లోనూ ఉదయభాను నటించింది. ఎర్ర సైన్యం, కొండవీటి సింహాసనం, పోలీస్ నంబర్ వన్, శ్రావణమాసం, ఆపద మొక్కుల వాడు, లీడర్, జులాయి, మధుమతి తదితర సినిమాల్లో స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో సందడి చేసింది.

ఉదయ  భాను లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Udaya Bhanu (@iamudayabhanu)

View this post on Instagram

A post shared by Udaya Bhanu (@iamudayabhanu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.