- Telugu News Photo Gallery Cinema photos Varalaxmi Sarathkumar plans her marriage with Nicholai Sachdev in Thailand
Varalaxmi Sivakumar: వరలక్ష్మి ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఆ దేశంలోనే గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్.. ఫొటోస్
నటుడు శరత్ కుమార్ గారాల పట్టి, ప్రముఖ దక్షిణాది నటి నటి వరలక్ష్మి శరత్‍కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్‍దేవ్‍తో ఎంగేజ్‌మెంట్ చేసుకుందీ అందాల తార. త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగ నుంది.
Updated on: Jun 12, 2024 | 11:09 PM

టుడు శరత్ కుమార్ గారాల పట్టి, ప్రముఖ దక్షిణాది నటి నటి వరలక్ష్మి శరత్‍కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్‍దేవ్‍తో ఎంగేజ్‌మెంట్ చేసుకుందీ అందాల తార. త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగ నుంది.

పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ఇటీవల పలువురు సినీ, రాజకీయ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేస్తోంది వరలక్ష్మి. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.

అలాగే నయనతార- విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్థ్ తో సహా పలువురు కోలీవుడ్ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానించింది వరలక్ష్మి.

ఇక టాలీవుడ్ లో హీరో రవితేజ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించింది.

కాగా వరలక్ష్మి, నికోలాయ్ సచ్‌దేవ్ వివాహం థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం

జూలై 2న ఈ ప్రేమ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం చెన్నైలో రిసెప్షన్‍ను ప్లాన్ చేసినట్లు సమాచారం.





























