- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Team India Won By 7 Wickets Against United States And And Qualify Super 8
USA vs IND: రాణించిన సూర్య, దూబె.. యూఎస్ఏపై ఘన విజయం.. సూపర్ 8కు టీమిండియా
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తద్వారా సూపర్-8 స్టేజ్ కు అర్హత సాధించింది. న్యూ యార్క్ వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది
Updated on: Jun 12, 2024 | 11:58 PM

Tటీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తద్వారా సూపర్-8 స్టేజ్ కు అర్హత సాధించింది. న్యూ యార్క్ వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్ (27) టాప్ స్కోరర్ గా నిలవగా, స్టీవెన్ టేలర్ 24 పరుగులతో రాణించారు.

అనంతరం 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు

అంతకు ముందు కెప్టెన్ రోహిత్ (3), విరాట్ కోహ్లీ (0) నిరాశపర్చగా.. రిషభ్ పంత్ (18) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నారు.

వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటోన్న శివమ్ దూబె ( 35 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

నాలుగు కీలక వికెట్లు పడగొట్టి అమెరికాను కట్టడి చేసిన టీమిండియా పేసర్ అర్షదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.




