పెయిన్‌ కిల్లర్‌ కాదు.. కిడ్నీ కిల్లర్స్! వీటితో జాగ్రత్త..

10 March 2026

TV9 Telugu

TV9 Telugu

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా.. నేటి కాలంలో మార్కెట్లో పలు జబ్బులకు వాడే మందుల వల్ల రోగాలు తగ్గకపోగా కొత్త రోగాలు చుట్టుకుంటున్నాయ్‌

TV9 Telugu

ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ నొప్పినే కాదు కిడ్నీలనూ చంపేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చీటికీ మాటికీ వేసుకునే యాంటి బయాటిక్స్‌ లాంగ్‌లైఫ్‌ని చిటికెలో చీకట్లో కలిపేస్తున్నాయ్‌. కాబట్టి రోగాల నుంచి కాపాడే మందులతో కాస్త జాగ్రత్తగా ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయట

TV9 Telugu

రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తూ దేహాన్ని కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుతాయి. మలిన రక్తాన్ని శుద్ధి చేస్తూనే దేహంలో రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తపోటు (బీపీ), రక్తంలో షుగర్‌ నియంత్రణలో లేకపోతే కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంది

TV9 Telugu

ఇలాంటి పరిస్థితుల్లో రక్త శుద్ధి తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే కిడ్నీలు విఫలమవుతాయి. ఇందుకు బీపీ, షుగర్‌ (డయాబెటిస్‌) రోగాలతోపాటు రోగాల నివారణకు వాడే మందులు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

నొప్పుల నివారణకు తీసుకొనే (పెయిన్‌ కిల్లర్స్‌) మందులు, యాంటిబయాటిక్స్‌ కిడ్నీలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తాయి.  మన దేశంలో 17 శాతం మందికి కిడ్నీ జబ్బులు ఉన్నాయని సీక్‌ స్టడీలో గుర్తించారు

TV9 Telugu

దీర్ఘకాలిక రోగులలో మూత్ర పిండాల రోగులూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే మూత్రపిండాలు విఫలమవడం వల్ల డయాలసిస్‌ అవసరమయ్యే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది

TV9 Telugu

బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, టీబీ, కాలేయ జబ్బులు, గుండె జబ్బులు, థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌ రోగుల్లో కిడ్నీలకు అధిక ప్రమాదం ఉంటుంది. వీళ్లు దీర్ఘకాలం మందులు వాడాలి. వీటిని వాడినప్పుడు కిడ్నీ పనితీరు మందగిస్తుంది

TV9 Telugu

ఆ మందుల దుష్ప్రభావంతో కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకని దీర్ఘకాల రోగాలతో బాధపడేవాళ్లు సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ని తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు