AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: అప్పుడు మా తాత మీద కోపం వచ్చింది.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్న తారక్ కు సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇటీవలే స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తనకు నచ్చిన హీరో ఎవరు అంటే టక్కున తారక్ అని చెప్పాడు. అంతలా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అభిమానులంటే తారక్ కు చాలా ఇష్టం.. అలాగే ఆయనంటే అభిమానులకు అంత ఇష్టం.

Jr.NTR: అప్పుడు మా తాత మీద కోపం వచ్చింది.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్
Ntr
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2024 | 9:17 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతకు తగ్గ మనవడిగా సత్తా చాటుకుంటూ.. టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయ్యింది. మొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమాలకు చేయకముందు కూడా ఇతర దేశాల్లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు తారక్. ఆయన నటనకు, డాన్స్ కు వంకపెట్టే వారు ఇంతవరకు పుట్టలేదు అని అంటుంటారు ఫ్యాన్స్. అవును అది నిజమే.. ఎంత పెద్ద డైలాగైనా.. అవలీలగా చెప్పగలడు.. ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే ఒక్కసారి చూసి చేసేస్తాడు.

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్న తారక్ కు సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇటీవలే స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తనకు నచ్చిన హీరో ఎవరు అంటే టక్కున తారక్ అని చెప్పాడు. అంతలా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అభిమానులంటే తారక్ కు చాలా ఇష్టం.. అలాగే ఆయనంటే అభిమానులకు అంత ఇష్టం. ఇదిలా ఉంటే తారక్ ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మా తాత మీద కోపం వచ్చిందని తెలిపాడు ఎన్టీఆర్.. చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యాడు.

ఇది కూడా చదవండి : హేయ్.. సన్ ఆఫ్ సత్యమూర్తి పాప నువ్వా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!

గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. ఒకసారి మా అమ్మగారిని నన్ను తాత రమ్మన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను.. మా అమ్మతో మాట్లాడుతూ.. “ఇంతకాలం దూరంగా ఉన్నాము.. దాని గురించి పట్టించుకోకండి. నా వంశోధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటివాడిగా తీర్చిదిద్దడంలో నీవంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నారు. ఆ తర్వాత చనిపోయారు. నాకు కోపం వచ్చింది. ఈయనేంటి ఇంత మాట అన్నాడు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నాడు.. వదిలేసి వెళ్ళిపోయాడు. అనాధగా మళ్లీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు ఒక దిక్కు వచ్చిందని దైర్యం. ఇంతలోనే అనాధగా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటిది.? ఏంటిది.? అనుకునేవాడిని.. కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అర్ధమవుతుంది. మూడు అక్షరాలు ఇచ్చాడు ఎన్టీఆర్. ఆయన పోలికలు ఇచ్చాడు. అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆయన ఆశీర్వాదం.. ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మా అమ్మ వంతు బాధ్యత అమ్మ నిర్వర్తించింది. ఇప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యారు తారక్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. పెద్దాయన ఎక్కడ ఉన్నా, ఆయన ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి, కోట్లాది మంది అభిమానులు ఎప్పుడు నీకు అండగా ఉంటారు. ఇంకా అంత కంటే కావాల్సింది ఏమీ లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..