AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!

ఆలయంలో సంచరిస్తున్న కోతుల బాధ నుంచి భక్తులకు విముక్తి కల్పించేందుకు ఆలయ అధికారులు చేసిన ఓ ప్రయత్నం సత్ఫలితాలనవ్వంతో పాటు భక్తులకు ఆశిర్వాదాలను అందిస్తోంది. అవును ఆలయంలోని కోతులను తరిమి కొట్టేందుకు అధికారులు కొండముచ్చులను ఆయల ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. వాటి రాకతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పాటు అక్కడే ఉన్న కొండముచ్చులు ఆలయానికి వచ్చని భక్తులకు ఆశిర్వచనాలు ఇస్తున్నాయి.

Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
Prasannanjaneya Swamy Temple
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 3:25 PM

Share

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు స్థానికంగా కోతుల బెడద ఎక్కువ కావడంతో.. వాటని బెడదను తగ్గించేందుకు అధికారులు కొండముచ్చును తీసుకొచ్చి కోతులను తరుముతున్నారు. సాధారణంగా గుంపులుగా వచ్చే కోతులను అదుపు చేయడం మనుషులకు సాధ్యం కావడంకాకపోవడంతో ఆలయ నిర్వాహకులు భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు కొండముచ్చును తీసుకొచ్చారు. కోతులను తరిమివేయడమే కాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు ఈ కొండముచ్చు ఆశీర్వదిస్తుండటంతో అధికారుల నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశంజిల్లా అద్దంకి సమీపంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో గత కొన్ని రోజులుగా కోతుల బెడద పెరిగిపోయింది. ఈ కోతుల బెడదను నివారించేందుకు గతంలో అద్దంకి మున్సిపాలిటీ ఉద్యోగి కోటయ్యకు ఓ కొండముచ్చును ఇచ్చి నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు కోటయ్య ఉద్యోగం మానివేయడంతో కొండముచ్చును ఆలయానికి తీసుకురావడం మానేశాడు.

ఈక్రమంలో తిరిగి కోతుల బెడద ఎక్కువ కావడంతో తిరిగి కోటయ్యకు కొండముచ్చును ఆలయ పరిసరాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో కోతుల బెడద కొంతమేర తగ్గిపోయింది. అంతేకాదు భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న కొండముచ్చును చూసి ఆశీర్వాదం అందుకుంటున్నారు. వానరం ఆశీర్వదిస్తే సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామే ఆశీర్వదించినట్టు భావించి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులు ఆలయానికి క్యూ కట్టి కొండముచ్చు నుంచి ఆశిర్వాదం పొందుతున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దేవుని దర్శనంతో పాటు కొండముచ్చు ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం..
డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం..
పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా? పాస్‌ఫ్రేజ్‌ టెన్నిక్‌ గురించి తెలుసు
పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా? పాస్‌ఫ్రేజ్‌ టెన్నిక్‌ గురించి తెలుసు
రాసి పెట్టుకోండి.. ఈ ఉగాది నుంచి వీరు ప్రపంచాన్నే ఏలేస్తారు
రాసి పెట్టుకోండి.. ఈ ఉగాది నుంచి వీరు ప్రపంచాన్నే ఏలేస్తారు
ఈగుడి చాలా స్పెషల్!ఎక్కడ చూసిన పాములే,పైథాన్స్‌కి VIP ట్రీట్మెంట్
ఈగుడి చాలా స్పెషల్!ఎక్కడ చూసిన పాములే,పైథాన్స్‌కి VIP ట్రీట్మెంట్
రాగి జావ ఎప్పుడు తీసుకుంటే మంచిది.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..
రాగి జావ ఎప్పుడు తీసుకుంటే మంచిది.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..