Demon Pavan: డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో కుటుంబం
బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న డీమన్ పవన్ టాప్ 3గా నిలిచాడు. హౌస్ లో రీతూ చౌదరితో రిలేషన్ కారణంగా పలు విమర్శలు ఎదుకున్నప్పటికీ తన ఆటతో మెప్పించాడు డీమన్ పవన్. రెండు సార్లు హౌస్ లో కెప్టెన్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డీమన్ పవన్ తండ్రి కన్నుమూశారు. బిగ్ బాస్ సీజన్ 9లో డీమన్ పవన్ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సామాన్యుల క్యాటగిరీలో అగ్నిపరీక్షలో పాల్గొన్న పవన్ అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి పెట్టాడు. బిగ్ బాస్ ఫినాలే దాక వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా డీమన్ పవన్ ఇంట విషాదం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పవన్ తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. ఈమేరకు పవన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
బిగ్‌బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. పవన్ తండ్రి నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పవన్ తెలిపి ఎమోషనల్ అయ్యాడు. ఈక్రమంలోనే ఆయన నేడు కన్నుమూశారు. దాంతో డీమన్ పవన్ తండ్రి మృతికి నెటిజన్స్, పలువుడ్ సెలబ్రెటీలు సంతాపం తెలుపుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న డీమన్ పవన్ టాప్ 3గా నిలిచాడు. హౌస్ లో రీతూ చౌదరితో రిలేషన్ కారణంగా పలు విమర్శలు ఎదుకున్నప్పటికీ తన ఆటతో మెప్పించాడు డీమన్ పవన్. రెండు సార్లు హౌస్ లో కెప్టెన్ అయ్యాడు. చివరిలో 15లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు డిమాన్ పవన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




