AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya: నాకు అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి.. కానీ నేను ఇలా చేశా.. హీరోయిన్ రమ్య కామెంట్స్

దర్శన్ తనతో రిలేషన్ లో ఉంటున్న ఓయువతికి అసభ్యకర మెసేజులు పంపిస్తున్నడని రేణుక స్వామి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. హత్య చేసిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో దీని పై పెద్ద చర్చ జరుగుతుంది. దర్శన్ ను సినిమాలనుంచి బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

Ramya: నాకు అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి.. కానీ నేను ఇలా చేశా.. హీరోయిన్ రమ్య కామెంట్స్
Ramya Divya
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2024 | 7:35 AM

Share

హత్య కేసులో చిక్కుకొని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కన్నడ నటుడు దర్శన్.కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోగారు గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే చాలా మంది హీరోయిన్స్ లో మనోడికి లింకులు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు ఓ వగలాడి కోసం ఓ వ్యక్తి హత్య చేయించాడు. దర్శన్ తనతో రిలేషన్ లో ఉంటున్న ఓయువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నడని రేణుక స్వామి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. హత్య చేసిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో దీని పై పెద్ద చర్చ జరుగుతుంది. దర్శన్ ను సినిమాలనుంచి బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

కాగా తాను కూడా ఇలా అసభ్యకరం మెసేజ్‌లు వల్ల ఇబ్బంది పడ్డాను అంటుంది నటి రమ్య. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్ తో పటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ లో సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ క్రిషన్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

అలాగే ఇప్పుడు కన్నడ రమ్య 2013లో మాండ్య నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది. తాజాగా రమ్య దర్శన్ వ్యవహారం పై స్పందించింది. దర్శన్ చేసిన దారుణాన్ని ఆమె ఖండించింది. తాను కూడా ఇలా అసభ్యకర మెసేజులు, ట్రోల్స్ కు గురయ్యారని.. అయితే మనకు ఎవరైనా మెసేజ్‌లతో ఇబ్బంది కలిగిస్తే బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఆమె మాట్లాడుతూ.. ట్రోల్స్ ఎక్కువైతే మీరు ఫిర్యాదు చేయవచ్చు. నన్ను కూడా చెడు పదాలతో ట్రోల్ చేశారు. నేనే కాదు చాలా మంది ట్రోల్‌కు గురయ్యారు. ఇతరుల భార్యలు, పిల్లలను ట్రోల్ చేసేవారు చాలా మంది ఉన్నారు. మనం చెడ్డ సమాజంలో జీవిస్తున్నాం అని రాసుకొచ్చారు. చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడిలాగే నేను కూడా ఫిర్యాదు చేశాను. అలాంటి వారిని పోలీసులు హెచ్చరించడంతో పాపం కేసు వెనక్కి తీసుకున్నాను. ట్రోల్స్ చేసే వారికి కూడా భవిష్యత్తు ఉంది. కొన్ని ఫేక్ ఖాతాల ద్వారా ట్రోల్ చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు’ అని రమ్య అన్నారు. అలాగే చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. మీరు వెళ్లి మనుషులను కొట్టి చంపకండి. ఒక సాధారణ ఫిర్యాదు సరిపోతుంది. పోలీసుల పై నాకు నమ్మకం ఉంది. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగరని, చట్టంపై ప్రజల ఆశలు నిలుపుకుంటారని నమ్ముతున్నాను అని రమ్య తన ఇన్ స్టార్ స్టోరీలో రాసుకొచ్చారు.

Ramya

రమ్య ఇన్ స్టా గ్రామ్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..