AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్‌కి తెర తీసిన కల్కి టీమ్‌.. దేశవ్యాప్తంగా.

గతంలో ఎన్నడూ లేని విధనంగా సరికొత్త పంథాలో సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందుకోసం కల్కి టీమ్‌ ప్రత్యేకవాహనాలను వినియోగిస్తోంది. వాహనాలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో తిప్పనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను....

Kalki 2898 AD: ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్‌కి తెర తీసిన కల్కి టీమ్‌.. దేశవ్యాప్తంగా.
Kalki 2898 Ad
Narender Vaitla
|

Updated on: Jun 14, 2024 | 7:09 AM

Share

కల్కి సినిమా విడుదల కోసం.. కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ సినిమా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. వెండి తెరపై ఎప్పుడెప్పుడు ఈ విజువల్‌ ట్రీట్‌ను ఎంజాయ్‌ చేద్దామా అని ఆసక్తితో ఉన్నారు. జూన్‌ 27వ తేదీన కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది.

గతంలో ఎన్నడూ లేని విధనంగా సరికొత్త పంథాలో సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందుకోసం కల్కి టీమ్‌ ప్రత్యేకవాహనాలను వినియోగిస్తోంది. వాహనాలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో తిప్పనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే కల్కి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న సమయంలో రికార్డుల మోత మొదలైంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా ప్రీమియర్‌ టికెట్స్‌ ప్రీ సేల్‌ బిజినెస్‌లో కల్కి దుమ్మురేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పుడే మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. ఈ విషయంలో కల్కి, ట్రిపులార్‌ సినిమా రికార్డును అధిగమించడం విషయం. ఈ ప్రీమియర్‌ టికెట్స్‌ ద్వారా అభిమానులు ఒకరోజు ముందే అంటే జూన్‌ 26వ తేదీన నార్త్‌ అమెరికాలో ప్రీమియ్‌ షోలు చూడడనున్నారు.

కాగా ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీలో.. అమితాబ్‌తో పాటు కమల్‌హాసన్‌, దిశాపటానీ, సస్వతా ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?