- Telugu News Photo Gallery Cinema photos Dil Raju And His Wife Tejaswini Recent US Vacation Photos Goes Viral
Dil Raju: ఫారిన్ వెకేషన్‌లో ‘దిల్ రాజు’ ఫ్యామిలీ.. భార్యాభర్తల రొమాంటిక్ ఫొటోస్ చూశారా?
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫారిన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: Jun 13, 2024 | 11:05 PM

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫారిన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో దిల్ రాజు, ఆయన సతీమణి తేజస్విని ఎంతో స్టైలిష్ గా కనిపించారు. దిల్ రాజు నీలిరంగు డెనిమ్ షార్ట్‌లు, షర్ట్‌లో దర్శనమివ్వగా, తేజస్విని వైట్ కలర్ డ్రెస్ లో కనిపించారు.

ఈ పిక్స్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. హీరో, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారంటూ దిల్ రాజు-తేజస్విని ఫొటోలపై రియాక్ట్ అవుతున్నారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తేజస్విని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్, లవ్ మీ సినిమాలు అభిమానులను నిరాశపర్చాయి.

అయితే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నితిన్ తో కలిసి తమ్ముడు అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.