AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వావ్ మిరాకిల్.. అమ్మవారి సన్నిధిలో అద్భుత దృశ్యం.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు!

ఆధ్యాత్మిక చింతన మనుషులతో పాటు ఇతర జీవరాశులలో కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుదుగా మనకు దర్శనమిచ్చే చిత్ర విచిత్ర ఘటనల మాదిరిగానే పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మనుషుల వలే ఒక తాబేలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. అది గమనించిన భక్తులు ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: వావ్ మిరాకిల్.. అమ్మవారి సన్నిధిలో అద్భుత దృశ్యం.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు!
Viral Turtle Pradakshina (1)
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 2:48 PM

Share

గుడిలో గర్భగుడి చూట్టూ మానవులు ప్రదిక్షణలు చేయడం సర్వసాధారణం. కానీ కరీనంగర్ జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని నూకాలమ్మ ఆలయం చుట్టూ ఓ కూర్మం ( తాబేలు ) ప్రదక్షణలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చూసింది. ఎక్కడి నుండో ఆలయానికి చేరుకున్న ఈ కూర్మం, నిర్మానుషంగా ఉన్న వాతావరణాన్ని చూసి గుడి చుట్టూ తిరిగడం స్టార్ట్ చేసింది. దీన్ని గమనించిన స్థానికులు తొలుత మూములుగానే తాబేలు అలా వెళ్తోంది అనుకున్నారు.

కానీ ఒకసారి గుడి చుట్టూ తిరిగి వచ్చిన కూర్మం మరోసారి ప్రదక్షణ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఆయలం చూట్టూ ప్రదిక్షణలు చేస్తున్న తాబేటును చూసి స్థానిక భక్తులంతా ఆశ్చర్యపోయారు. వెళ్లేందుకు చుట్టుపక్కల దారులు ఉన్నప్పటికీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఏంటని నివ్వెర పోయారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని చుట్టుపక్కల తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట దావణంలా వ్యాపించడంతో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని కూర్మ ప్రదక్షణను ఆసక్తిగా తిలకించారు. జనం తాకిడిని గమనించిన ఆ తాబేలు నెమ్మదిగా సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. దేవత పట్ల కూర్మం చూపిన భక్తిని గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తమ గ్రామంలో ఈ సన్నివేశం జరగడం పట్ల ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us