Chiranjeevi: మోదీ మాటలు గుర్తు చేసుకుని చిరు ఎమోషనల్.. వీడియో.
చంద్రబాడు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. అందరికీ ఎన్నో మధుర జ్జాపకాలను.. మిగిల్చింది. అందులోనూ మెగా ఫ్యామిలీకి ఈ కార్యక్రమం కలకాలం నిలిచిపోయే వేడుకగా మారిపోయింది. మెగాస్టార్ కూర్చున్న దగ్గరికే మోదీ స్వయం వెళ్లి మరీ ముచ్చటించడం.. పవన్, చిరు చేతులను పైకి లేపీ మరీ.. అందరికీ అభివాదం చేయడం.. ఈ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. అందరికీ ఎన్నో మధుర జ్జాపకాలను.. మిగిల్చింది. అందులోనూ మెగా ఫ్యామిలీకి ఈ కార్యక్రమం కలకాలం నిలిచిపోయే వేడుకగా మారిపోయింది. మెగాస్టార్ కూర్చున్న దగ్గరికే మోదీ స్వయం వెళ్లి మరీ ముచ్చటించడం.. పవన్, చిరు చేతులను పైకి లేపీ మరీ.. అందరికీ అభివాదం చేయడం.. ఈ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ హైలెట్ సీన్ గురించి తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరు. అంతేకాదు మోదీ తనతో ఏం ముచ్చటించాడో కూడా.. తన ట్వీట్‌లో వివరించారు చిరు. ప్రమాణ స్వీకారం అనంతరం తమతో మోదీ ఏం మాట్లాడారో చెబుతూ చిరు ఎమోషనల్ ట్వీట్ చేశారు. “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.
కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయిని అన్నారు. ఆయన చెప్పిన ఆ మాటలు నన్ను ఎంతగానో ఆనందపరిచాయి.” అని చిరు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు ప్రధాని మోదీ సునిశిత దృష్టికి కృతజ్ఞతలు చెప్పారు చిరు. తమ్ముడి స్వాగతోత్సవంలాగే మోదీతో జరిగన సంభాషణ కూడా తనకు కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకమంటూ.. చిరు తన ట్వీట్ లో కోట్ చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే మోదీతో మాట్లాడిన వీడియో షేర్ కూడా మరో సారి చేశారు. ఇక చిరు షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.