Darshan: ‘నేను గర్భవతిని.. ఇప్పుడు నాకు దిక్కెవరు?’.. రేణుకా స్వామి భార్య కన్నీరు మున్నీరు

కన్నడ స్టార్ హీరో దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించాడన్న విషయం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న నెపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలు వస్తున్నాయి.

Darshan: 'నేను గర్భవతిని.. ఇప్పుడు నాకు దిక్కెవరు?'.. రేణుకా స్వామి భార్య కన్నీరు మున్నీరు
Darshan, Renuka Swamy Wife
Follow us

|

Updated on: Jun 12, 2024 | 9:40 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించాడన్న విషయం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న నెపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. రేణుకా స్వామి భార్య సహానా ఇప్పుడు మూడు నెలల గర్భంతో ఉంది. భర్త హత్య వార్త విన్న సహనా కుప్పకూలిపోయింది. నాకు పెళ్లయి ఏడాది అయింది. ఇప్పుడు నేను గర్భవతిని. ‘ నా భర్తకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ మధ్యాహ్నం ఆయన నాకు ఫోన్ చేశాడు. బెంగుళూరుకు వెళ్లే విషయమై ఏమీ మాట్లాడలేదు. మా ఆయన దర్శన్ అభిమాని అయి ఉండొచ్చు. కానీ నాకు న్యాయం కావాలి , అది దర్శన్ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు. నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. నేను ఎలా జీవించాలి? నా భర్త ఏదైనా తప్పు చేసినా ఇలా దారుణంగా చంపి ఉండాల్సింది కాదు. వార్నింగ్ ఇచ్చి ఉంటే సరిపోయేది’ అని సహానా కన్నీరు మున్నీరైంది.

‘నటుడైనా సరై.. స్టార్ అయినా నాకు న్యాయం కావాలి’ అని సహానా కోరుతోంది. ఇప్పుడు తన భర్తను ఎవరు తిరిగి తీసుకువస్తారూ’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. మృతురాలి భార్యకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. కాగా రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులను 6 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.

ఇవి కూడా చదవండి

దర్శన్ తో పవిత్ర గౌడ…

రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా ఉన్నారు. దర్శన్ ఏ2గా, కె.పవన్ ఏ3గా ఉన్నారు. రాఘవేంద్ర ఏ4, నందీష్ ఏ5, జగదీష్ అలియాస్ జగ్గా ఏ6, అను ఏ7, రవి ఏ8, రాజు ఏ9, వినయ్ ఏ10, నాగరాజ్ ఏ11, లక్ష్మణ్ ఏ12, దీపక్ ఏ13, ప్రదోష్ ఏ14, కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా నమోదయ్యారు. ప్రస్తుతం మొత్తం 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!