T20 World Cup 2024: బుమ్రాను ఇంటర్వ్యూ చేసిన సంజన.. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? వీడియో ఇదిగో

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 3 కీలక వికెట్లు (బాబర్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) పడగొట్టాడు. కాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాను అతని భార్య సంజన ఇంటర్వ్యూ చేయడం విశేషం.

T20 World Cup 2024: బుమ్రాను ఇంటర్వ్యూ చేసిన సంజన.. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? వీడియో ఇదిగో
Jasprit Bumrah, Sanjana Ganesan
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2024 | 8:53 AM

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ కు మరో ఓటమి తప్పదని భావించారు చాలామంది. కానీ భారత బౌలర్లు చెలరేగిపోయారు. పాక్ జట్టుకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 3 కీలక వికెట్లు (బాబర్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) పడగొట్టాడు. కాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాను అతని భార్య సంజన ఇంటర్వ్యూ చేయడం విశేషం. సంజనా గణేశ ప్రస్తుతం ICC డిజిటల్ ఇన్‌సైడర్‌గా స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది సంజన. ‘తీవ్రమైన ఒత్తిడిలో విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం కష్టం కాబట్టి మేము భయపడలేదు. కలిసి పోరాడి గెలిచాం. నా బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న నాకు సంతృప్తినిచ్చింది . ఇదే జోరును కొన‌సాగించాల‌ని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు.’ అని జస్ప్రీత్ బుమ్రా భార్యతో చెప్పుకొచ్చాడు.

ఇంట‌ర్వ్యూ ముగిసిన త‌రువాత బుమ్రాకు సంజ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుద్దాం అని చెప్పింది. వెంట‌నే బుమ్రా.. ‘నేను మిమ్మ‌ల్ని 30 నిమిషాల త‌రువాత మ‌ళ్లీ క‌లుస్తాను అని అన్నాడు. దీంతో డిన్న‌ర్‌ ఎక్క‌డా? అంటూ సంజ‌న అడిగింది. ప్ర‌స్తుతం ఈ భార్యా భర్తల ఇంట‌ర్వ్యూ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేశన్ 2013 ఐపీఎల్‌ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. మొదట స్నేహితులుగా మారారు. ఆ తర్వాత స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. దీంతో పెద్దల అనుమతిలో 2021 మార్ 15న వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు అంగద్ జస్ప్రీత్ బుమ్రా అనే కుమారుడు ఉన్నాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ అవార్డును గెల్చుకున్నాడు. ఇలా బుమ్రా వరుసగా రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..