AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amol Kale Death: భారత్ క్రికెట్‌లో విషాదం.. IND vs PAK మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఎంసీఏ అధ్యక్షులు హఠాన్మరణం

టీ 20 ప్రపంచకప్ లో భాగంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూడటానికి అమోల్ కాలే ఆదివారం న్యూయార్క్ వెళ్లారు. మ్యాచ్‌ని వీక్షించి సహచరులతో కలిసి స్టేడియం నుంచి తిరిగి వస్తుండగా గుండెపోటుతో అమోల్ కాలే మృతి చెందినట్లు సమాచారం.

Amol Kale Death: భారత్ క్రికెట్‌లో విషాదం.. IND vs PAK మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఎంసీఏ అధ్యక్షులు హఠాన్మరణం
Amol Kale Death
Basha Shek
|

Updated on: Jun 10, 2024 | 10:50 PM

Share

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. టీ 20 ప్రపంచకప్ లో భాగంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూడటానికి అమోల్ కాలే ఆదివారం న్యూయార్క్ వెళ్లారు. మ్యాచ్‌ని వీక్షించి సహచరులతో కలిసి స్టేడియం నుంచి తిరిగి వస్తుండగా గుండెపోటుతో అమోల్ కాలే మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు ప్రముఖులు కాలే ఆకస్మిక మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రతిపక్ష నేత జితేంద్ర అహ్వాద్ అమోల్ కాలే మృతికి సంతాపం తెలిపారు. ‘ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే గొప్ప నిర్వాహకుడు. క్రికెట్ ప్రేమికుడు. ప్రపంచానికి వీడ్కోలు చెప్పే వయసు నీకు రాలేదు. ఇది నాకు వ్యక్తిగత నష్టం’ అని తన ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

రెండేళ్ల క్రితం ఎంసీఏ అధ్యక్షుడిగా..

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2022లో సందీప్ పాటిల్ తర్వాత అమోల్ కాలే MCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముంబయి సీనియర్ పురుషుల జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును వచ్చే సీజన్ నుంచి రెట్టింపు చేయాలని నిర్ణయించడం ఇందులో ఒకటి. అంటే, పురుషుల జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజుతో సమానమైన మ్యాచ్ ఫీజును ముంబై ఆటగాళ్లు పొందుతారు. అమోల్ కాలే నిర్ణయం పై ప్రశంసలు వచ్చాయి.

అమోల్ కాలే నాగ్‌పూర్‌లో జన్మించారు. దాదాపు పదేళ్లపాటు ముంబైలో నివసించారు. అమోల్ కాలే తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ట్రస్టీగా కూడా ఉన్నారు. ముంబైలో అనేక రకాల వ్యాపారాలు నిర్వహించారు. అమోల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడు కూడా. MCA ప్రెసిడెంట్‌తో పాటు, అమోల్ కాలే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌ను కూడా ప్రోత్సహించారు. అమోల్ కాలే హయాంలో 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. ఆయన హయాంలో ముంబై ఇటీవల 2023-24లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..