- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Team India's Upcoming Matches Schedule, Venues And Timings
T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్‌లు ఎప్పుడు, ఎవరితోనంటే? పూర్తి షెడ్యూల్ ఇదిగో
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో పాక్ జట్టుపై విజయం సాధించింది. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే టీమిండియా సూపర్-8 దశకు చేరుకుంటుంది
Updated on: Jun 11, 2024 | 7:31 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో పాక్ జట్టుపై విజయం సాధించింది. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే టీమిండియా సూపర్-8 దశకు చేరుకుంటుంది.

అంటే గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. దీని ప్రకారం, ఇప్పుడు భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా, USA జట్టు రెండవ స్థానంలో ఉంది.

న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత పాక్‌ను 113 పరుగులకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక భారత్ తదుపరి మ్యాచ్‌ల విషయానికి వస్తే..

జూన్ 12 (బుధవారం) భారత్ వర్సెస్ అమెరికా: టీ20 ప్రపంచకప్‌లో భారత్-అమెరికా జట్ల మధ్య జూన్ 12న న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

జూన్ 15 (శనివారం) భారత్ వర్సెస్ కెనడా: అమెరికాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 33వ మ్యాచ్‌లో భారత్, కెనడా తలపడనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ , మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.|| రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.





























