- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024, Ravindra Jadeja, T20 World Cup History, IND vs PAK, Team India
T20 World Cup: 15 ఏళ్ల ఫెయిల్యూర్ స్టోరీ.. 10 మ్యాచ్‌ల్లో 95 పరుగులు.. భారత జట్టుకు భారమైన ఆల్ రౌండర్..
Ravindra Jadeja: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 15 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జడేజా క్రీజులోకి దిగాడు. భారత్ ఇన్నింగ్స్ 35 బంతులు మిగిలి ఉండగానే జడేజాకు మంచి ఇన్నింగ్స్ పూర్తి చేసే అవకాశం వచ్చింది. కానీ, తొలి బంతికే ఖాతా తెరవకుండానే జడేజా ఔటయ్యాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అవసరమైన సమయంలో జడేజా తన బ్యాటింగ్‌తో మరోసారి నిరాశపరిచాడు.
Updated on: Jun 11, 2024 | 8:05 AM

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీలో కేవలం 119 పరుగులకే ఆలౌటైనప్పటికీ పాకిస్థాన్‌పై టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయానికి ఘనత పేసర్లకే దక్కుతుంది. బ్యాటింగ్ పరంగా రిషబ్ పంత్ మినహా టీమిండియాలోని మిగతా బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ సహా స్టార్ బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేశారు.

వీరితోపాటు జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిరంతర వైఫల్యం జట్టును ఆందోళనకు గురి చేసింది. గత 15 ఏళ్లలో టీ20 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో జట్టుకు రవీంద్ర జడేజా అందించిన సహకారం కూడా పెద్దగా లేదు.

నిజానికి న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. అంతేకాదు వర్షం కారణంగా మారిన పరిస్థితుల్లో ముందుగా బ్యాటింగ్ చేయడం మరింత కష్టమైంది. ఇటువంటి పరిస్థితిలో, టీమ్ ఇండియాకు ప్రతీ బ్యాట్స్‌మెన్ సహకారం అవసరం.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి బ్యాట్స్‌మెన్ తొందరగానే ఔటయ్యారు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సహకారం తప్పనిసరిగా మారింది. కానీ, జడేజా ఖాతా తెరవలేకపోయాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 15 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జడేజా క్రీజులోకి దిగాడు. భారత్ ఇన్నింగ్స్ 35 బంతులు మిగిలి ఉండగానే జడేజాకు మంచి ఇన్నింగ్స్ పూర్తి చేసే అవకాశం వచ్చింది. కానీ, తొలి బంతికే ఖాతా తెరవకుండానే జడేజా ఔటయ్యాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అవసరమైన సమయంలో జడేజా తన బ్యాటింగ్‌తో మరోసారి నిరాశపరిచాడు.

జడేజా బ్యాటింగ్ వైఫల్యం కథ కొత్త కాదు. జడేజా 2009 నుంచి టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. 2022 ప్రపంచ కప్ మినహా ప్రతిసారీ ఆడాడు.

ఈ అన్ని ఎడిషన్లలో జడేజాకు కొన్నిసార్లు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, అవకాశం వచ్చినప్పుడు జడేజా సహకారం అందించలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడిన జడేజా 99 బంతుల్లో 95 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 6 బౌండరీలు, 1 సిక్స్ మాత్రమే ఉన్నాయి.

జడేజా బ్యాటింగ్‌లో పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, బౌలింగ్‌లో అతను తన వంతు సహకారం అందించాడు. అతను ప్రపంచ కప్ చరిత్రలో 21 వికెట్లతో టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే, అతని నుంచి బ్యాట్‌తో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జడేజా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు.




