AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: శనీశ్వరుడు అస్తంగత్వం..నెల రోజుల పాటు వారు జాగ్రత్త..!

మార్చి 14 నుంచి రవి మీన రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న శనికి చేరువ కావడంతో శని అస్తంగత్వం చెందనున్నాడు. ఈ పరిస్థితి ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుండటంతో వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు జాగ్రత్తగా ఉండి శివార్చన చేయడం శ్రేయస్కరం.

Lord Shani: శనీశ్వరుడు అస్తంగత్వం..నెల రోజుల పాటు వారు జాగ్రత్త..!
Lord Shani Dev
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 7:27 PM

Share

ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రవి ఈ నెల(మార్చి) 14 నుంచి మీన రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. మీన రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న శనికి రవి చేరువకావడంతో శని దగ్ధం కావడం జరుగుతుంది. దీన్ని జ్యోతిష పరిభాషలో అస్తంగత్వం అంటారు. శనీశ్వరుడు అస్తంగత్వం చెందడం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ అస్తంగత్వ దోషం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. మీన రాశి శని వల్ల అనుకూల ఫలితాలను అనుభవిస్తున్న వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారు తరచూ శివార్చన చేయడం మంచిది.

  1. వృషభం: ఈ రాశికి అత్యంత శుభ ప్రదం, యోగదాయకం అయిన లాభ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే, శనికి ఏర్పడిన అస్తంగత్వ దోషం వల్ల వీరు ఒక నెల రోజుల పాటు ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఏమీ ఆశించకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం కోల్పోవడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి తగ్గడం, ఆదాయ ప్రయత్నాలు మందగించడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
  2. మిథునం: ఈ రాశికి దశమంలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, రాజ పూజ్యాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం, శీఘ్ర పురోగతి కలుగుతాయి. అయితే, అస్తంగత్వ దోషం వల్ల శని వీరి పురోగతికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఇతర సంస్థల్లోకి మారే ప్రయత్నాలు విఫలమవుతాయి. కొన్ని అవకాశాలను చేజార్చుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాభంగాలు కలుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శని సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. అయితే, శని అస్తంగత్వం చెందినందువల్ల కొన్ని రకాల అదృష్టాలకు, అవకాశాలకు దూరమవుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారకపోవడం మంచిది. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించకపోవడం ఉత్తమం. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
  4. తుల: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశివారికి ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. అయితే, ఈ శని ఇక్కడ అస్తంగతుడు అయినందువల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ పోటీదార్లు విజృంభిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశికి అర్ధాష్టమ శని తొలగిపోయి, పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, సమర్థతకు గుర్తింపు లభించడం, ఆదాయం వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. అయితే, శని దగ్ధం కావడం వల్ల ఉద్యోగంలోనే కాక, ఇతరత్రా కూడా ప్రాధాన్యం కోల్పోవడం జరుగుతుంది. పిల్లలు చదువుల్లో వెనుకబడతారు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాకపోవచ్చు. అనారోగ్య సమస్యలు పీడించే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మటుమాయం అవుతాయి. అయితే, శనికి పట్టిన అస్తంగత్వ దోషం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యలు విజృంభించే అవకాశం ఉంది. శత్రువులు విజృంభించే అవకాశం కూడా ఉంది. ప్రయత్నాలు, పనులు, అవకాశాలు విజయవంతం అయ్యే అవకాశం లేదు.

Follow Us