- Telugu News Photo Gallery Cinema photos Nayanthara and Vignesh Shivan celebrate their second marriage anniversary, Shares Photos
Nayanthara: నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి రోజు.. పిల్లలతో కలిసి సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోస్ చూశారా?
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ లవ్లీ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకరు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022 జూన్ 9 మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
Updated on: Jun 09, 2024 | 10:01 PM

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ లవ్లీ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకరు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022 జూన్ 9 మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

కాగా ఆదివారం (జూన్ 09) నయన్- విఘ్నేశ్ ల రెండో వివాహా వార్షికోత్సవం. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో భాగంగా విదేశాల్లో విహరిస్తోన్న ఈ జంట తమ రెండో పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ మేరకు నయన భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేశాడు. అందులో తన భార్య, పిల్లలతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలో అత్యంత గొప్పవిషయం'

'నా భార్య తంగమేయిని నేను ఎంతో ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, మధురమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా'

'ఆ దేవుడు మనకు ఎల్ల వేళలా అండగా నిలవాలని కోరుకుంటున్నాను. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనలయ్యాడు విఘ్నేశ్