- Telugu News Photo Gallery Cinema photos Hero Ram Pothineni Next Movie with Miss Shetty mr polishetty director mahesh babu Telugu Heroes Photos
Ram Pothineni: రామ్ కెరీర్‌ని డబుల్ ఇస్మార్ట్ మారుస్తుందా.? RAPO ప్లాన్ ఏంటి.?
డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మీద పూరి జగన్నాథ్ కెరీర్ ఎంత డిపెండ్ అయి ఉందో తెలియదు కానీ, రామ్ కి మాత్రం ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమాలంటూ ఒకటికి రెండు ప్రాజెక్టులు వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు రామ్ కెరీర్‌లో. అందుకే మళ్లీ సేమ్ ఫార్ములానే నమ్ముకున్నారు. ఆల్రెడీ లైగర్‌తో ఇబ్బందిపడ్డ పూరి జగన్నాథ్ తేరుకుని, డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు.
Updated on: Jun 09, 2024 | 6:10 PM

డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మీద పూరి జగన్నాథ్ కెరీర్ ఎంత డిపెండ్ అయి ఉందో తెలియదు కానీ, రామ్ కి మాత్రం ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమాలంటూ ఒకటికి రెండు ప్రాజెక్టులు వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు రామ్ కెరీర్‌లో.

అందుకే మళ్లీ సేమ్ ఫార్ములానే నమ్ముకున్నారు. ఆల్రెడీ లైగర్‌తో ఇబ్బందిపడ్డ పూరి జగన్నాథ్ తేరుకుని, డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

ముందే చెప్పిన షెడ్యూల్స్ ప్రకారం అంతా జరిగి ఉంటే, ఈ పాటికి సినిమా విడుదల కావాల్సింది. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఆ మధ్య కొన్నాళ్ల పాటు ఆగింది.

ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ముంబైలో ఇటీవల షెడ్యూల్ కంప్లీట్ చేశారు రామ్. రీసెంట్ రిలీజ్ స్కంథ నిరాశపరచడంతో డబుల్ ఇస్మార్ట్ మీద డబుల్ హోప్స్ పెట్టుకున్నారు రామ్.

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాగానే రామ్ ఏం చేస్తారనే మాట ఎప్పటికప్పుడు చర్చల్లోకి వస్తోంది. గౌతమ్ వాసుదేవమీనన్‌తో ఓ సినిమా ఉందంటూ వార్తలున్నాయి. దాంతో పాటు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరక్టర్ మహేష్ బాబుకి కాల్షీట్ ఇచ్చారనే మాటలూ ఉన్నాయి.

చాన్నాళ్లుగా సక్సెస్ లేకుండా ఉన్న అనుష్క కెరీర్‌ని గాడిలో పెట్టిన మహేష్ బాబు, ఇప్పుడు రామ్‌కి కూడా జబర్దస్త్ సక్సెస్ అయ్యే స్క్రిప్ట్ వినిపించారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్..




