IND vs PAK: టీమిండియా చేతిలో ఓటమి.. గుక్కపట్టి ఏడ్చిన పాక్ క్రికెటర్.. ఓదార్చిన రోహిత్.. వీడియో వైరల్

India vs Pakistan ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా ఆదివారం (జూన్ 09) ఆదివారం కిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు చేసింది

IND vs PAK: టీమిండియా చేతిలో ఓటమి.. గుక్కపట్టి ఏడ్చిన పాక్ క్రికెటర్.. ఓదార్చిన రోహిత్.. వీడియో వైరల్
India Vs Pakistan
Follow us
Basha Shek

|

Updated on: Jun 10, 2024 | 10:48 PM

India vs Pakistan ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా ఆదివారం (జూన్ 09) ఆదివారం కిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది. కాగా ఎంతో ఉత్కంఠ పోరు సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా కంటతడి పెట్టుకున్నాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 9వ ప్లేస్‌ లో వచ్చిన నసీమ్ షా ఆఖరి ఓవర్‌లో పోరాట పటిమ ప్రదర్శించాడు. 5 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో వరుసగా బౌండరీలు కొట్టాడు. మొత్తం 4 బంతులు ఎదుర్కొన్న నసీమ్ 2 ఫోర్లతో 10 పరుగులు చేశాడు. అయితే పాక్ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించడంతో నసీమ్ షా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో సహచరుడు షాహీన్ అఫ్రిది అతనిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత హ్యాండ్‌షేక్ ఇస్తూ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాక్ జట్టు యువ పేసర్‌ను ఓదార్చాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నసీమ్‌ షాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే పాక్ క్రికెట్ ప్రేమికులు కూడా యువ ఆటగాడి ఆటతీరును అభినందిస్తున్నారు. ఇవి క్రికెట్ పట్ల నసీమ్ షా ప్రేమకు నిదర్శనమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ అదరగొట్టిన నసీమ్ షా..

టీ20 ప్రపంచ కప్ లో భారత్ చేతిలో పాక్ కు  ఏడో ఓటమి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్