Poonam Kaur: ‘వైఎస్ జగన్ ఫ్యామిలీ మొత్తం మళ్లీ కలిసిపోవాలి.. అప్పుడే’.. నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్

సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని పూనమ్ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె 'వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు' అని ట్వీట్ చేసింది

Poonam Kaur: 'వైఎస్ జగన్ ఫ్యామిలీ మొత్తం మళ్లీ కలిసిపోవాలి.. అప్పుడే'.. నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
YS Jagan, Poonam Kaur
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2024 | 9:06 PM

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని పూనమ్ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. అసలు పూనమ్ ఎవరిని ఉద్దేశించి పూనమ్ ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ, జనసేన కూటమి గురించి కూడా ట్వీట్ చేసింది. సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించిన ఆమె జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని పూనమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ ట్వీట్..

గతంలో జగన్ పై పూనమ్ కౌర్ ప్రశంసలు..