Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ‘భజే వాయు వేగం’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గతేడాది బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను భజే వాయు వేగం అంటూ ఢిపరెంట్ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించాడు

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. 'భజే వాయు వేగం' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Bhaje Vaayu Vegam Movie
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 10, 2024 | 6:42 AM

గతేడాది బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను భజే వాయు వేగం అంటూ ఢిపరెంట్ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించాడు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అంచనాలు కాస్త నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాయి.  ఇలా భారీ అంచనాలతో మే 31న థియేటర్లలో విడుదలైన భజే వాయు వేగం సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. కార్తికేయ గుమ్మకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , ట్విస్టులు బాగా ఉన్నాయని, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని రివ్యూలు వచ్చాయి. అయితే పోటీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, గం గం గణేశా సినిమాలు రిలీజ్ కావడం కార్తికేయ సినిమాకు మైనస్ గా మారింది. కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడుతోన్న కార్తికేయ భజే వాయు వేగం సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ ఓటీటీ, మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ కుదరిందని సమాచారం.

కాగా థియేటర్లలో రిలీజైన నెల రోజు తర్వాతే భజే వాయు వేగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా ముందే ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుందని తెలుస్తోంది. ఒక వేళ ఈనెల ఆఖరి వారంలో రాకపోతే జూలై మొదటి వారంలో భజే వాయు వేగం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కు రానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై భజే వాయు వేగం సినిమా తెరకెక్కింది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కపిల్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.