- Telugu News Photo Gallery Cinema photos Jacqueline Fernandez Joins Beach Cleaning Programme On World Environment Day, Shares Photos
Jacqueline Fernandez: బీచ్‌లో చెత్తను క్లీన్ చేసి, మొక్కలు నాటిన జాక్వెలిన్.. ఫొటోస్ చూశారా?
బుధవారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. ఇంకొందరు పరిసరాలను శుభ్రం చేశారు. జాక్వెలిన్ కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగమైంది. ఇందులో భాగంగా ముంబైలోని బీచ్‌ని శుభ్రం చేసింది
Updated on: Jun 06, 2024 | 1:33 PM

బుధవారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. ఇంకొందరు పరిసరాలను శుభ్రం చేశారు. జాక్వెలిన్ కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగమైంది. ఇందులో భాగంగా ముంబైలోని బీచ్‌ని శుభ్రం చేసింది.

ఇటీవల ఎక్కువగా వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలుస్తోంది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. నటనకు విరామం ఇచ్చిన ఆమె తాజాగా ముంబై బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీచ్ ప్లీజ్ ఇండియా' కమ్యూనిటీతో కలిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బీచ్‌ను శుభ్రం చేశారు.

అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్ గా మారియ. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు జాక్వెలిన్ పై ప్రశంసలు కురిపించారు.సెలబ్రిటీలు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే అభిమానులకు, సామాన్యులకు స్ఫూర్తిగా ఉంటుందంటున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి జంతువులంటే అమితమైన ప్రేమ. అందుకే బీచ్ క్లీనింగ్ సమయంలో అక్కడికి వచ్చిన కుక్కతో సరదాగా ఆటలాడుకుంది.

శ్రీలంక లో పుట్టి పెరిగిన జక్వెలిన్ ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. సినిమాలతో పాటు నిత్యం వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది.





























