AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Movie OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

ఇప్పుడు మరో తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అదే స్టార్. కోలీవుడ్ హీరో కెవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మే 10న థియేటర్లలో విడుదలై మంచి రివ్యూస్ సంపాదించుకుంది. దాదాపు పన్నెండు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా హీరో కావాలని కలలు కనే ఓ యువకుడి కథే ఈ చిత్రం.

Star Movie OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
Star Movie Ott
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 5:23 PM

Share

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు వచ్చేస్తున్నాయి. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు కూడా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అదే స్టార్. కోలీవుడ్ హీరో కెవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మే 10న థియేటర్లలో విడుదలై మంచి రివ్యూస్ సంపాదించుకుంది. దాదాపు పన్నెండు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా హీరో కావాలని కలలు కనే ఓ యువకుడి కథే ఈ చిత్రం.

థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ప్రచారం, ప్రటనలు లేకుండా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను ఇటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాలో కెవిన్ తోపాటు ప్రీతీ ముకుందన్, అదితి పొన్నకర్, లాల్ కీలకపాత్రలు పోషించారు.

కథ విషయానికి వస్తే.. ఓ ఫోటోగ్రాఫర్ తన కుమారుడిని ఎలాగైనా హీరో చేయాలనుకుంటాడు. దీంతో తండ్రి సపోర్ట్ చేయడంతో చిన్నప్పటి నుంచే ఆ కుర్రాడికి సినిమా అంటే విపరీతమైన ఇష్టం పెరుగుతుంది. హీరోగా మారాలని అనుకుంటాడు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలో అతడికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అనేక కష్టాలు ఎదుర్కొని ముంబైలో యాక్టింగ్ కోర్సులు పూర్తి చేసిన ఆ కుర్రాడికి హీరోగా అవకాశం వస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్తుండగా.. యాక్సిడెంట్ జరిగి ముఖమంతా గాయాలవుతాయి. దీంతో అందవికారంగా మారడంతో సినిమా అవకాశాలు దూరమైపోతాయి. ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతడి జీవితంలోకి వచ్చిన మరో అమ్మాయి ఎవరు..? హీరో కావాలనుకున్న ఆ అబ్బాయి చివరకు ఏమయ్యాడు అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!