AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka: ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బర్రెలక్క.. ఈసారి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

డిగ్రీ చేసిన బర్రెలక్క ఉద్యోగం రాకపోవడంతో బర్రెలను కాసుకుంటున్నానని మొదట ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత కూడా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌ గా మారిపోయింది బర్రెలక్క

Barrelakka: ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బర్రెలక్క.. ఈసారి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
Barrelakka Alias Sirisha
Basha Shek
|

Updated on: Jun 06, 2024 | 12:28 PM

Share

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె పేరు మార్మోగిపోయింది. డిగ్రీ చేసిన బర్రెలక్క ఉద్యోగం రాకపోవడంతో బర్రెలను కాసుకుంటున్నానని మొదట ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత కూడా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌ గా మారిపోయింది బర్రెలక్క. అదే క్రేజ్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అనూహ్యంగా ఆమెకి ప్రజలనుండి, ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. జేడీ లక్ష్మీ నారాయణ, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ప్రముఖులు సైతం ఆమెకు సపోర్టుగా నిలిచారు. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది బర్రెలక్క. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా శిరీషకు ఐదు వేలకు పైగా ఓట్లు రావడం కొసమెరుపు.

కాగా ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది శిరీష. పెద్దలు నిశ్చయించిన అబ్బాయితో కలిసి ఏడడుగులు నడిచింది. దీంతో ఇక రాజాకీయాలకు బర్రెలక్క స్వస్తి పలికినట్టేనని భావించారు చాలా మంది. అయితే భర్తతో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి స్థానానికి నామినేషన్ వేసి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు చేదు అనుభవం ఎదురైంది. కనీస పోటీ ఇవ్వకుండానే ఓడిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 5754 ఓట్లు సాధించిన బర్రెలక్క.. ఎంపీ అభ్యర్థిగా మాత్రం కేవలం 3087 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో ఆమెకు కేవలం 0.25 శాతం ఓట్లు పడ్డాయి. మొత్తంగా 12వ స్థానంలో నిలిచింది బర్రెలక్క. ఇక్కడ నోటాకు 4,580 ఓట్లు రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

 భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తోన్న బర్రెలక్క.. వీడియో ఇదిగో..

కాగా ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్పీ గట్టిగా మద్దతు తెలిపారు. బీఎస్పీలోకి రావాలని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

యుద్ధం మొదలైంది.. లోక సభ ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా