Allu Arjun: అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడు.. మాస్ రాజా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా.?
పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన అన్ని చోట్ల ఘనవిజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకూడా లభించింది. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు ఆర్య.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన అన్ని చోట్ల ఘనవిజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకూడా లభించింది. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు ఆర్య. ఈసినిమాకు కూడా సుకుమారే దర్శకత్వం వహించారు.
ఆర్య సినిమా సుకుమార్ కు తొలి సినిమా. గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఆర్య సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని ఎవరు గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఓ బెకాల్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నాడట.
గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా కాలం సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. చాలా కథలు విన్నప్పటికి అవి నచ్చక సినిమాలు చేయకుండా ఉండిపోయారు. ఈ సమయంలోనే దర్శకుడు బోయపాటి శ్రీను భద్ర కథను బన్నీకి వినించాడట. కథ విన్న బన్నీ ఈ సినిమా చేద్దామా .. వద్దా అనే డైలామాలో ఉండగానే సుకుమార్ ఆర్య కథను చెప్పాడట. ఆర్య కథ యూత్ ను ఆకట్టుకునే కథ కావడంతో బన్నీ ఆర్య సినిమాకు ఓకే చెప్పాడట. దాంతో బోయపాటి భద్ర సినిమా కథను రవితేజకు వినిపించగా ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పి చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇటు ఆర్య కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బన్నీ రిజెక్ట్ చేయడంతో రవితేజకు భద్ర రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.
అల్లు అర్జున్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




