Nikhil Siddhartha: ‘వచ్చాడయ్యో సామి’.. మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించిన నిఖిల్.. గ్రామస్తుల పూల వర్షం.. వీడియో

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే టాలీవుడ్ హీరోల్లో అతను కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిఖిల్ ఖాతాలో ఉన్నాయి

Nikhil Siddhartha: 'వచ్చాడయ్యో సామి'.. మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించిన నిఖిల్.. గ్రామస్తుల పూల వర్షం.. వీడియో
Nikhil Siddhartha
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2024 | 1:28 PM

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే టాలీవుడ్ హీరోల్లో అతను కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిఖిల్ ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడీ హీరో. ప్రస్తుతం స్వయంభు అంటూ మరో క్రేజీ ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే హీరో నిఖిల్ చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరువలో ఉంది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు నిఖిల్‌. ఆల‌యాన్ని ఓపెన్ చేయడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు.

ఈ సందర్భంగా ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన హీరో నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు గ్రామస్తులు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఇందులో గ్రామస్తులందరూ నిఖిల్ ను పూలపై నడిపించడం చూడవచ్చు. ఈ వీడియోను ఇన్ స్టాలో పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నిఖిల్ చాలా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక స్వయంభు సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పూలు చల్లి నిఖిల్ ను ఆలయంలోకి ఆహ్వానిస్తున్న గ్రామస్తులు.. వీడియో ఇదిగో..

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!