Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ‘జబర్దస్త్ పిలుస్తోంది..రా.. కదలిరా’.. ఓటమిని ఒప్పేసుకున్న రోజాపై బండ్లన్నసెటైర్లు

నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ గెలుపును ఆశించిన నటి రోజాకు కూడా చేదు అనుభవం ఎదురైంది. కౌంటింగ్ ప్రారంభమయినప్పటి నుంచే టీపీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏరౌండ్ లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది. దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు

Bandla Ganesh: 'జబర్దస్త్ పిలుస్తోంది..రా.. కదలిరా’.. ఓటమిని ఒప్పేసుకున్న రోజాపై బండ్లన్నసెటైర్లు
Bandla Ganesh, Rk Roja
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2024 | 2:46 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి దూసుకుపోతోంది. అన్ని చోట్లా టీడీపీ, జనసేన అభ్యర్థులదే ఆధిపత్యం కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు వైస్సార్సీపీ అభ్యర్థులు ముందే ఓటమిని ఒప్పేసుకుంటున్నారు. నిరాశగా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఇక నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ గెలుపును ఆశించిన నటి రోజాకు కూడా చేదు అనుభవం ఎదురైంది. కౌంటింగ్ ప్రారంభమయినప్పటి నుంచే టీపీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏరౌండ్ లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది. దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ 20 వేలకు పైగా మెజారీటీతో కొనసాగుతున్నారు. కాగా ఫలితం వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన రోజాపై ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సెటైరికల్ ట్వీట్ వేశారు. ‘జబర్దస్త్ పిలుస్తోందిరా.. కదలిరా’ అంటూ రోజా ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అంతకు ముందు కూడా రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు

ఇవి కూడా చదవండి

సినిమాల సంగతి పక్కన పెడితే.. వీరిద్దరూ రాజకీయాల్లో బద్ద శత్రువులు. పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకున్నారు.  కాగా మంగళవారం ఉదయం బండ్ల గణేశ్ తీవ్ర  అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  అయితే ఆయన ఆరోగ్యం మెరుగ్గా  నే ఉందని డాక్టర్లు చెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బండ్ల గణేశ్… వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.