Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yodha Kandrathi: అల్లరి పిల్ల యోధ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా? హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు

కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో యోధ సిస్టర్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్, రీల్స్ ఎక్కడ చూసినా వీరిదే హవా. అత్తా కోడళ్లుగా వీరు సృష్టించిన కామెడీ బీభత్సం, హంగామాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. జనాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యోధ సిస్టర్స్.. పటాస్, జబర్దస్త్ వంటి టాప్ కామెషోస్ లోనూ సత్తా చాటారు.

Yodha Kandrathi: అల్లరి పిల్ల యోధ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా? హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు
Jabardasth Child Artist Yodha
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2024 | 1:12 PM

కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో యోధ సిస్టర్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్, రీల్స్ ఎక్కడ చూసినా వీరిదే హవా. అత్తా కోడళ్లుగా వీరు సృష్టించిన కామెడీ బీభత్సం, హంగామాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. జనాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యోధ సిస్టర్స్.. పటాస్, జబర్దస్త్ వంటి టాప్ కామెషోస్ లోనూ సత్తా చాటారు. ముఖ్యంగా తన యోధ తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. చిన్న వయసులోనే చాలా క్యూట్ గా యోధ డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేవారు. అలా చాలా ఏళ్ల పాటు ఆడియెన్స్ ను నవ్వించి మెప్పించిన యోధ సడెన్ గా మాయమైపోయింది. చదువు మీద దృష్టి పెట్టడంతో బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాలతో అభిమానులతో టచ్ లో ఉంటోంది. యోధను ఫాలో అయ్యే వాళ్లు తనను గుర్తు పట్టవచ్చు కానీ ఇతరులు యోధను చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టమే.

ఎందుకంటే యోధ ఇప్పుడు ఎంతో అందంగా మారిపోయింది. ఒక హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ అమ్మడిలో ఉన్నాయి. అంతలా మారిపోయింది యోధ. ప్రస్తుతం యోధ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సాధారణంగా అమ్మాయిలు త్వరగా ఎదిగిపోతారు. ఇప్పుడు యోధ కూడా అలాగే మరింత అందంగా, హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తయారైంది. అచ్చమైన తెలుగమ్మాయిలా హాఫ్ శారీలో ఇన్ స్టా రీల్స్ చేస్తోంది. కుందనపు బొమ్మలా, బాపు గీసిన బొమ్మలా చక్కని వీడియోస్ తో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యోధను ఇన్ స్టా గ్రామ్ లో 2.82 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ అకౌంట్ ను యోధ తల్లిదండ్రులే మెయింటెయిన్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో యోధ హీరోయిన్ గా వస్తుందో లేదో వేచి చూడాలి మరి.

యోధ లేటెస్ట్ ఫొటోస్ ఇవిగో..

Jabardasth Child Artist Yod

Jabardasth Child Artist Yodha (Credit: yodhakandrathi Instagram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి