AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon: దాడి పై స్పందించిన రవీనా టాండన్.. అసలు ఆరోజు ఏం జరిగిందంటే..

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రవీనా ‘నన్ను కొట్టొద్దు’ అని వేడుకుంది. దీన్ని పలువురు ఖండించారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు తాజా సమాచారం ఇచ్చారు. ఈ వీడియోలో రవీనా చాలా భయపడిపోయారు. నన్ను నెట్టకండి, నన్ను కొట్టకండి అంటూ వేడుకుంది ఆమె. సెలబ్రిటీలకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశిస్తున్నారు.

Raveena Tandon: దాడి పై స్పందించిన రవీనా టాండన్.. అసలు ఆరోజు ఏం జరిగిందంటే..
Raveena Tandon
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2024 | 12:50 PM

స్టార్ హీరోయిన్ రవీనా టాండన్‌ అనుకోని చిక్కుల్లో పడింది. తాజాగా ఆమె పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. తాజాగా రవీనా టాండన్‌ కారు రీవార్స్ చేస్తుండగా.. అనుకోకుండా ఓ మహిళను ఢీ కొట్టారు. దాంతో కొంతమంది ఆమె పై దాడి చేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రవీనా ‘నన్ను కొట్టొద్దు’ అని వేడుకుంది. ఈ వీడియోలో రవీనా చాలా భయపడిపోయారు. నన్ను నెట్టకండి, నన్ను కొట్టకండి అంటూ వేడుకుంది ఆమె. సెలబ్రిటీలకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశిస్తున్నారు. దీన్ని పలువురు ఖండించారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు తాజా సమాచారం ఇచ్చారు.

ఈ ఘటనపై జోన్ 9 డీసీపీ రాజ్ తిలక్ రోషన్ మాట్లాడారు. ఈ ఘటనపై ఆయన ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. రవీనా ఇంటికి కారులో వచ్చింది. ఆమె కారు రివర్స్‌లో తీస్తుండగా.. కారు ఎవరినీ తాకలేదు. కానీ అక్కడ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ‘మాపై దాడి జరిగిందని రవీనా గానీ, గొడవ చేసిన వారు ఫిర్యాదు చేయలేదు. కాబట్టి కేసు ఏం లేదు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డ్రైవర్‌ కారు నడిపాడు. రవీనాను కావాలనే ఈ కేసులో ఇరికించారని అన్నారు. అలాగే ఆ సమయంలో రవీనా మద్యం తాగలేదు అని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. దీని పై రవీనా ఇన్ డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యింది. ఆమె ఇన్ స్టా స్టోరీలో తనపై వచ్చిన ఫేక్ న్యూస్‌లను అలాగే తన పై వచ్చిన రియల్ న్యూస్‌ను షేర్ చేసింది. అక్కడ ప్రమాదం జరగలేదని, తాను మద్యం తగలేదని ఇన్ డైరెక్ట్ క్లారిటీ ఇచ్చింది.

రవీనా సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంది. రీసెంట్ గా ‘ఆరణ్యక్’తో OTTలోకి అడుగు పెట్టింది. ‘కేజీఎఫ్ 3’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. రవీనా టాండన్ దాడి అనంతరం బాధితుడు మహమ్మద్  మాట్లాడుతూ.. “కారు రివర్స్ చేస్తున్నప్పుడు కారు మా అమ్మను ఢీకొట్టింది, డ్రైవర్ మా అమ్మను ఢీ కొట్టాడు. ఆతర్వాత కారులో నుంచి బయటకు వచ్చిన రవీనా మద్యం మత్తులో మా పై దాడి చేసింది” అని మహ్మద్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకోవడం లేదని అతను ఆరోపించారు. కానీ దీనిపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Raveena Tandon

రవీనా టాండన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.