Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paruvu Web Series: ‘పరువు’ హత్యల నేపథ్యంలో నివేదా తెలుగు వెబ్ సిరీస్ .. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ 'పరువు'. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ పవన్ సాధినేని షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు

Paruvu Web Series: 'పరువు' హత్యల నేపథ్యంలో నివేదా తెలుగు వెబ్ సిరీస్ .. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Paruvu Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jun 02, 2024 | 8:45 PM

నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ పవన్ సాధినేని షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న పరువు వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా పరువు సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ చేసిన డ్రామా.. ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? మర్డర్ కేస్ నుంచి ఎలా బయటపడ్డారు? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ట్రైలర్ ఉంది.

బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయింది. ఇక నాగబాబు చాలా రోజులకు ఓ సీరియస్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ ట్రైలర్‌లో అదిరిపోయింది. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. సిద్దార్థ్ నాయుడు మాటల రచయితగా వ్యవహరించగా, చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు.

పరువు వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి