AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinesh Karthik: పుట్టిన రోజే.. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన దినేశ్ కార్తిక్.. వీడియో

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన దినేష్ కార్తీక్.. తన పుట్టినరోజునే క్రికెట్ కెరీర్‌ను ముగించాడు.

Dinesh Karthik: పుట్టిన రోజే.. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన దినేశ్ కార్తిక్.. వీడియో
Dinesh Karthik
Basha Shek
|

Updated on: Jun 01, 2024 | 8:04 PM

Share

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన దినేష్ కార్తీక్.. తన పుట్టినరోజునే క్రికెట్ కెరీర్‌ను ముగించాడు. 2004లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన దినేష్ కార్తీక్ దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి నేటితో ఫుల్ స్టాప్ పడింది. దినేష్ కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక నిమిషం వీడియోను పోస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ వార్తను వెల్లడించాడు. ఈ వీడియోలో కార్తీక్ తన చిన్నప్పటి నుండి కెరీర్ చివరి వరకు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడీ సీనియర్ క్రికెటర్. ‘ గత కొన్ని రోజులుగా మీ అందరి నుండి నాకు లభించిన ప్రేమతో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఆలోచించిన తర్వాత, నేను ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలకాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నా క్రికెట్ కెరీర్ కు సహకరించిన నా కోచ్‌లు, కెప్టెన్‌లు, సహచరులు, సెలక్టర్లు, సహాయక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

‘మన దేశంలో చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి భారత జట్టులో ఆడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాకు శక్తిని ఇచ్చారు, వారు లేకుండా నేను ఈ స్థాయికి చేరుకోలేను. నా కెరీర్‌కు మద్దతుగా తన కెరీర్‌ను సైతం పణంగా పెట్టిన నా భార్య దీపికా పల్లికల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్.

ఇవి కూడా చదవండి

డీకే ఎమోషనల్ వీడియో..

దినేష్ కార్తీక్ తన కెరీర్‌లో మొత్తం 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. అలాగే 167 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 260 లిస్ట్ A మ్యాచ్‌లు, 401 T20 మ్యాచ్‌లు ఆడాడు. కార్తీక్ టెస్టుల్లో 1025 పరుగులు, వన్డేల్లో 1752 పరుగులు, టీ20ల్లో 686 పరుగులు చేశాడు. అతను తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 28 సెంచరీలు, లిస్ట్ Aలో 12 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సెంచరీని కూడా సాధించాడు. ముఖ్యంగా 2007లో, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు T20 ప్రపంచకప్‌లో మొదటి ఎడిషన్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ కూడా కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..