NTR: సీనియర్ ఎన్‌టీఆర్ పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నాడీ హీరో

స్వర్గీయ నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇతను కూడా టాలీవుడ్ హీరోనే. అయితే పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్నాడు

NTR: సీనియర్ ఎన్‌టీఆర్ పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నాడీ హీరో
Sr.NTR
Follow us
Basha Shek

|

Updated on: May 30, 2024 | 4:47 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ది ఒక ప్రత్యేక స్థానం. ఎలాంటి పాత్రలకైనా ప్రాణం పోసిన ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేయగలిగారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరి తర్వా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారక రత్నలు హీరోలుగా రాణించారు. ఇదిలా ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అందులో ఎన్టీఆర్ పక్కన ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. పై ఫొటో అదే. మరి ఇందులో స్వర్గీయ నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇతను కూడా టాలీవుడ్ హీరోనే. అయితే పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలకృష్ణ, చంద్రబాబు, టీడీపీ పార్టీలకు మద్దతుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నాడు. మరి ఈ కుర్రాడు ఎవరో ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్ అతను మరెవరో కాదు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తయుడు నందమూరి చైతన్యకృష్ణ. అదేనండి బ్రీత్ సినిమా హీరో

2003 లో జగపతిబాబు హీరోగా నటించిన ‘ధమ్’ అనే సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు నందమూరి చైతన్య కృష్ణ. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో సుమారు 20 ఏళ్ల తర్వాత బ్రీత్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మధ్యన ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి చైతన్య కృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అలాగే రాజకీయాలపైనా మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తన బాబాయి బాలకృష్ణ, చంద్ర బాబులకు మద్దతుగా హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. అదే సందర్భంలో సోషల్ మీడియాలోనూ భారీగా ట్రోల్ అవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

బ్రీత్ సినిమాలో నందమూరి చైతన్య కృష్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.