- Telugu News Photo Gallery Cinema photos Prabhas kalki 2898 AD Movie promotion start with Bujji event for releasing June 27th Telugu Heroes Photos
Prabhas – kalki 2898 AD: డార్లింగ్ టైం స్టార్ట్.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో నాగి స్పీడ్ ప్రమోషన్..
ఏమో అనుకున్నాం కానీ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ మామూలోడేం కాదు.. తన సినిమాను ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. కల్కి ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు.. అప్‌డేట్స్ రావట్లేదని విమర్శలు మొదలవుతున్న వేళ.. ఒక్కో అప్‌డేట్ ఇస్తున్నారు నాగ్ అశ్విన్. రాబోయే రోజుల్లో మరింత భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారీయన. కల్కి 2898 AD అప్‌డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు.. కొన్ని రోజులుగా ఫుల్ మీల్స్ పెడుతున్నారు నాగ్ అశ్విన్.
Updated on: May 31, 2024 | 4:44 PM

ఏమో అనుకున్నాం కానీ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ మామూలోడేం కాదు.. తన సినిమాను ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. కల్కి ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు.. అప్‌డేట్స్ రావట్లేదని విమర్శలు మొదలవుతున్న వేళ.. ఒక్కో అప్‌డేట్ ఇస్తున్నారు నాగ్ అశ్విన్.

రాబోయే రోజుల్లో మరింత భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారీయన. కల్కి 2898 AD అప్‌డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు.. కొన్ని రోజులుగా ఫుల్ మీల్స్ పెడుతున్నారు నాగ్ అశ్విన్.

బుజ్జి కోసం ఈవెంట్.. ఆ తర్వాత టీజర్.. నిన్నటికి నిన్న యానిమేషన్ వీడియోలు.. ఇలా రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు. ఇదంతా టీజర్ మాత్రమే.. అసలు ప్రమోషన్ జూన్ 4 తర్వాత చూపిస్తామంటున్నారు కల్కి మేకర్స్.

500 కోట్లకు పైగా బడ్జెట్‌తో వై జయంతి మూవీస్ కల్కి సినిమాను నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్‌తో పాటు సైన్స్ ఫిక్షన్‌గా వస్తున్నా.. ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది.

మహాభారతం నుంచి మొదలై 2898 వరకు.. అంటే 6 వేల ఏళ్ళ మధ్యలో ఈ కథ నడుస్తుందని.. కలియుగాంతంలో కల్కి రాకతో సుఖాంతం అవుతుందని తెలుస్తుంది.

విష్ణువుగా ప్రభాస్.. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్.. కలిగా కమల్ హాసన్ నటిస్తున్నారు. జూన్ 27న కల్కి రానుంది. ఇప్పటి వరకు ప్రభాస్, అమితాబ్‌తో పాటు బుజ్జి కారెక్టర్స్ రివీల్ చేసారు. ఇంకా దీపిక పదుకొనే, దిశా పటానీ పాత్రలు పరిచయం చేయలేదు.

దాంతో పాటు విజయ్ దేవరకొండ, నాని ఈ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్నారని తెలుస్తుంది. వీటితో పాటు వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఊహించిన దానికంటే భారీగానే వచ్చేస్తుంది కల్కి 2898 AD.




