Hardik Pandya: హార్దిక్- నటాషా విడాకులు! బాంబ్ పేల్చిన కామన్ ఫ్రెండ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చారుగా!

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకుల బాటలో పయనిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింగ తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి

Hardik Pandya: హార్దిక్- నటాషా విడాకులు! బాంబ్ పేల్చిన కామన్ ఫ్రెండ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చారుగా!
Hardik Pandya, Natasa Stankovic
Follow us
Basha Shek

|

Updated on: May 29, 2024 | 8:14 PM

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకుల బాటలో పయనిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింగ తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అటు హార్దిక్ కానీ, నటాషా కానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. అయితే ఇంతలో వీరిద్దరికి బాగా పరిచయమున్న ఒక కామన్ ఫ్రెండ్ హార్దిక్- నటాషాల విడాకుల వ్యవహారంపై స్పందించాడు. ఇప్పటికే ఈ జంట గత కొన్ని నెలలుగా విడివిడిగా జీవిస్తున్నారంటూ సంచలన విషయాలను బయట పెట్టాడు. సన్నిహితుల కథనం ప్రకారం ఈ దంపతుల మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తాయి. అలాగే నటాషా స్వయంగా హార్దిక్ పాండ్యాను వదిలి వేరే జీవితం గడుపుతోంది. అందుకే వీరిద్దరూ మళ్లీ కలుస్తారో లేదో తెలియదు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెలుస్తోంది.

హార్దిక్ తో సరిగ్గా లేనందున నటాషా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ నుండి పాండ్యా ఇంటి పేరును తొలగించింది. అలాగే ఈ ఐపీఎల్‌లో నటాషా ఒక్కసారి కూడా స్టేడియంలో కనిపించలేదు. ఇలా వీరిద్దరి విడాకుల పుకార్లు షికార్లు చేస్తుండగానే నటాషా తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో కనిపించింది. తాజాగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా పాండ్యా గురించి రిపోర్డర్లు అడగ్గా నటాషా జస్ట్ ‘థ్యాంక్స్’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇలా నటాషా మౌనం కూడా విడాకుల ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.

ఇవి కూడా చదవండి

ఈ విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోపై నటాషా స్పందించింది. కృనాల్ తన కుమారుడు కవిర్, అలాగే అగస్త్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీనికి స్పందించిన నటాషా హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. దీంతో హార్దిక్, నటాషాల మధ్య అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ పుకార్లకు స్వస్తి పలకాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నిజానిజాలు బయటపెట్టాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ