AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIT Movie OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇతర జానర్లతో పోల్చుకుంటే క్రైమ్, సస్పెన్స్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇలాంటి మూవీస్ కు థియేటర్లలో కలెక్షన్లు రాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపై రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఈ కారణంగానే కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తుంటారు

SIT Movie OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
SIT Movie
Basha Shek
|

Updated on: May 28, 2024 | 9:07 PM

Share

ఇతర జానర్లతో పోల్చుకుంటే క్రైమ్, సస్పెన్స్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇలాంటి మూవీస్ కు థియేటర్లలో కలెక్షన్లు రాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపై రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఈ కారణంగానే కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తుంటారు. సినిమా ప్రియుల నుంచి వీటికి కూడా మంచి ఆదరణ వస్తుంటుంది. ఇప్పుడు అలా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజైన ఒక సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉండడంతో ఆడియెన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది . అదే అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా నటించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) సినిమా. ఈ సినిమాకు విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. మే 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో సిట్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే తమ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని టాప్ – 5లో సిట్ మూవీ ట్రెండ్ అవుతోందంటున్నారు మేకర్స్. అలాగే రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందని ఆడియెన్స్ అడుగుతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

సిట్ సినిమా కథేంటంటే..

ఇక సిట్ సినిమా కథ విషయానికొస్తే.. స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్ ఓ క్రైమ్ ను ఎలా సాల్వ్ చేసిందనేది ఈ సినిమాలో చూపించారు. ఓ అమ్మాయి రేప్, మర్డర్ కేసును పోలీసాఫీసర్ అయిన అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు? హంతకులను ఎలా పట్టుకున్నాడన్నదే ఈ సినిమా కథ. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్ట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయంటున్నారు మేకర్స్. మరి మీరు సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడతారా? అయితే సిట్ సినిమాపై ఓ లుక్ వేయండి

ఇవి కూడా చదవండి

కిల్లర్ ఎవరంటే?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..