AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యా మారన్.. అంతటి బాధలోనూ ప్లేయర్లతో ఏమన్నారంటే? వీడియో

ఆదివారం (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైది. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన ఎస్ ఆర్ హెచ్ అనూహ్యంగా ఓటమి పాలు కావడాన్ని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు

Kavya Maran: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యా మారన్.. అంతటి బాధలోనూ ప్లేయర్లతో ఏమన్నారంటే? వీడియో
Kavya Maran
Basha Shek
|

Updated on: May 27, 2024 | 9:08 PM

Share

ఆదివారం (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైది. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన ఎస్ ఆర్ హెచ్ అనూహ్యంగా ఓటమి పాలు కావడాన్ని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఎప్పుడూ స్టాండ్స్ లో కూర్చొని ఎస్ ఆర్ హెచ్ కు సపోర్టు నిస్తోన్న ఓనర్ కావ్యా మారన్ కూడా స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అంతలోనే తేరుకుని చప్పట్లు కొట్టి తమ ఆటగాళ్లను మనసారా అభినందించింది. కాగా ఫైనల్లో పరాజయం తర్వాత వెంటనే సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లింది కావ్యా పాప. అంతటి బాధలోనూ తమ క్రికెటర్లను ఓదార్చి ధైర్యం చెప్పింది. ఆటలో గెలుపోటములు సహజమేనంటూ, మమ్మల్ని గర్వపడేలా చేశారంటూ తమ ప్లేయర్లపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగుపెట్టిన కావ్యా మారన్ మొదట నిరాశలో ఉన్న క్రికెటర్లను పలకరించింది. మీరు మిమ్మల్ని ఎంతో గర్వపడేలా చేశారంటూ ప్రశంసించింది. అది చెప్పడానికే ఇక్కడి దాకా వచ్చానంది. ‘ మీ ఆటతీరుతో టీ20 క్రికెట్ కు కొత్త నిర్వచనం చెప్పారు. కోల్ కతా విజేతగా నిలిచినా ఇప్పుడు అందరూ మన టీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవాళ మాత్రమే మనం అనుకున్నట్లు జరగలేదు. దీనికి అందరూ బాధపడుతున్నారు. గత సీజన్ లో మనం ఆఖరి స్ధానంలో నిలిచాం. అయినా అభిమానులు మమ్మల్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలివచ్చారు. కాబట్టి ఇలా బాధపడుతూ కనిపించకండి. మనం ఫైనల్స్ ఆడాం. అందరూ బంతితోనూ, బ్యాట్ తో నూ అద్భుతంగా రాణించారు’అంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది కావ్య. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అంతటి బాధలోనూ ప్లేయర్లలో ధైర్యం నింపిన ఎస్ ఆర్ హెచ్ కో ఓనర్ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లతో కావ్యా మారన్.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..