Nicki Minaj: డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో

నిక్కీ మినాజ్‌ని ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేయగా, ఆమె బ్యాగ్‌లో కొన్ని 'సాఫ్ట్ డ్రగ్స్' కనిపించాయి. ఆ వస్తువులు నెదర్లాండ్స్‌లో నిషేధం. దీంతో పోలీసులు నిక్కీని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆమె తన మొబైల్ ఫోన్‌లో సంఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించింది. డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత, 'ఆ వస్తువులు నావి కావు, నా సెక్యూరిటీ గార్డుకి చెందినవి' అని నిక్కీ మినాజ్ చెప్పింది

Nicki Minaj: డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో
Nicki Minaj
Follow us

|

Updated on: May 26, 2024 | 6:02 PM

అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, రాపర్, మోడల్ నిక్కీ మినాజ్‌ను నెదర్లాండ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్‌ను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని నిక్కీ మినాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌గా వీడియో చేసింది. ఈ సంఘటన ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో జరిగింది. నిక్కీ మినాజ్‌ను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు తెలిసింది. నిక్కీ మినాజ్‌ని ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేయగా, ఆమె బ్యాగ్‌లో కొన్ని ‘సాఫ్ట్ డ్రగ్స్’ కనిపించాయి. ఆ వస్తువులు నెదర్లాండ్స్‌లో నిషేధం. దీంతో పోలీసులు నిక్కీని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆమె తన మొబైల్ ఫోన్‌లో సంఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించింది. డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత, ‘ఆ వస్తువులు నావి కావు, నా సెక్యూరిటీ గార్డుకి చెందినవి’ అని నిక్కీ మినాజ్ చెప్పింది. అయితే పోలీసులు ఆ మాటను అంగీకరించలేదు. చివరగా, పోలీసులు నిక్కీ మినాజ్‌ను తమ కారులో కూర్చోమని కోరారు. అయితే ఆ తర్వాత నిక్కీ మినాజ్ నిరసన వ్యక్తం చేసింది. ‘ఇప్పుడు ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తారా’ అని అడిగాడు. దానికి పోలీసులు సమాధానం చెప్పకుండా కేవలం కారులో కూర్చోమని చెప్పడం వీడియోలో రికార్డయింది.

నిక్కీ మినాజ్ ఇంగ్లాండ్‌లో కొన్ని లైవ్ షోలను ప్రదర్శించాల్సి ఉంది. మాంచెస్టర్‌తో సహా కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో నిక్కీ మినాజ్ లైవ్ గిగ్ షోలు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలకు అన్ని సన్నాహాకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు నిక్కీ మినాజ్ అరెస్ట్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దయి వందల కోట్ల నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Barbie (@nickiminaj)

నిక్కీ మినాజ్ ప్రసిద్ధ అమెరికన్ గాయని, మోడల్. ఆమె ‘పింక్ ఫ్రైడే’ ఆల్బమ్ బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో అదే పేరుతో మూడు ఆల్బమ్‌లను విడుదల చేసిందీ ర్యాప్ సింగర్. నిక్కీ కొన్ని సినిమాల్లో కూడా పని చేసింది. ‘ఐఎస్ ఏజ్’, ‘యాంగ్రీ బర్డ్స్’ అనే కార్టూన్ సినిమాలకు తన గొంతును అరువుగా ఇచ్చింది. అలాగే ‘బార్బర్ షాప్’, ‘ది అదర్ ఉమెన్’ సినిమాల్లో నటించింది.

View this post on Instagram

A post shared by Barbie (@nickiminaj)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..
వైసీపీని వీడిన మరో సీనియర్ నేత.. అసలు కారణం ఇదేనట..
వైసీపీని వీడిన మరో సీనియర్ నేత.. అసలు కారణం ఇదేనట..
సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి...
సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి...